విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవినగర్ నందు సుమారు 65 మీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపులైన్ ఏర్పాటుకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ,ఏ,ఎస్ వారి ఆదేశాలకు అనుగుణంగా పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మూలన దళ సిబ్బంది ద్వారా తొలగించారు. దేవినగర్ లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపు లైన్ ఏర్పాటు చేయు అంశముపై ఇంజనీరింగ్ అధికారులను అడిగితెలుసుకొని యుద్దప్రాతిపదికన పైపులైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సదరు ఆదేశాలకు అనుగుణంగా చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు మరియు సిటి ప్లానర్ ప్రసాద్ క్షేత్ర స్థాయి అధికారులతో కలసి పరిశీలించి అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపు లైన్ ఏర్పాటు చేయుటకు అడ్డంగా ఉన్న అనధికార కట్టడములను సిబ్బంది ద్వారా తొలగింపజేసినారు. కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్-2 ఇన్ ఛార్జ్ లక్ష్మీనారాయణ మరియు ఆయా శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News