Breaking News

రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకు పోతుంది…

-మన పిల్లలకు బంగారు రాష్ట్రాన్ని ఇద్దాం
-కుభేరుడు కూడ తీర్చలేని అప్పుల రాష్ట్రం కాదు
-అమరావతి చార్టెట్ ఆకౌంట్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్ తరాలకు అప్పులేని, బంగారు రాష్ట్రాన్ని ఇవ్వాలి కాని కూభేరుడు కూడ తీర్చలేని అప్పుల భారాన్ని ఇవ్వరాదని అమరావతి చార్టెట్ ఆకౌంట్స్ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో అమరావతి చార్టెట్ ఆకౌంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక క్రమశిక్షణ లోపిస్తుందని రాష్ట అప్పుల ఉబిలో కూరుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనవల్ల అప్పులు పంచి ఆస్తులు పంచని అన్యాయానికి గురికాబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యం ఆర్థిక విషయాలను ఎంతో జాగ్రత్తగా చూడలిసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వాలు అప్పులు తేవటడం తెచ్చిన అప్పులని మూలవ్యయాలకి కాకుండా రోజువారీ ఖర్చులకి వాడటం ఇంకా అప్పులు చెల్లించటానికి అప్పులు తేవటం ఇంకా అప్పులు తెచ్చే పరిధి పెంచేటటువంటి వెసులు బాటు కోసం చట్టాలను అసెంబ్లీ లో సవరించటం చూస్తుంటే భావితరాలకు ఆస్తులు ఇవ్వకపోయినా మోయలేని అప్పులు ఇస్తున్నామన్న భావం తో ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్స్ గ్రూప్ ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకొన్నారు. అప్పులు మూల వ్యయాలకి కాకుండా రోజువారి లేదా సంక్షేమ పథకాలకు కోసమే తేవటం అది గత రెండు ర్యాంవత్సరాల్లో కోట్ల అప్పు మొత్తంగా చూస్తుంటే మన పాలకులు మన ముని మనుమలు కూడా వడ్డీలు కట్టే పరిస్థితి తలుచుకొంటేనే భయమేస్తుందిని ఆందోళన వ్యక్తం చేశారు కాగ్ నివేదిక ప్రకారం చూపించిన మూల వ్యయాలని కూడా తప్పుపట్టే పరిస్తతి అంటే మొత్తం తెచ్చిన అప్పు పంచటానికే అన్న ఆలోచనే రాష్ట్ర పరిస్థితి ఏమౌతుందని అన్నారు.రాబడి తగ్గడం ఖర్చులు పెంచటం ద్రవ్యలోటు కి మూల కారణాలు అని కేంద్ర ప్రభుత్వ గ్రాంటులు కూడా దారి మళ్లించి రోజువారీ ఖర్చులకి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఉద్దేశ్యం రాబోవు రోజుల్లో కూడా అప్పు లేదా ఆస్తులు అమ్మకాలు ఒక్క రోజువారీ లేదా సంక్షేమ పథకాల కోసమే ఖర్చు పెడితే రాష్ట్రం దివాళా తీస్తుని అన్నారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా యఫ్ ఆర్ బియమ్ చట్టం సవరణ అంటే ప్రభుత్వం రాబోవు ఉపద్రవాన్ని గుర్తించలేదు అనుకోవాలన్నారు. రాష్ట్రానికి అప్పులు నిక్కచ్చిగా పంచిన కేంద్రము అలాగే ఆస్తులు ఉమ్మడి ఆస్తులు పంచటంలో నిర్లక్ష్యం వవహించిందని అన్నారు. ప్రభుత్వం ఖర్చులని తగ్గించుకొని ఆదాయము పెంచుకొనే మార్గాలని చూడాలన్నారు.తెచ్చిన అప్పులు అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టాలి ఆదాయ మార్గాలు పెంచాలని, కేంద్రం నుంచి మనకి రావలిసిన నిధులు ముఖ్యం గ విభజన చట్టం ప్రకారం రావలిసిన అన్ని మనము పార్టీలకి అతీతంగా గట్టిగ అడగాలని కోరారు. 4.మనకి ద్రవ్యలోటు విభజించటం వల్లే కనుక కేంద్రమే ఈ లోటు పూడ్చే మార్గాలను చూడాలి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.నేటి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూసి వ్యధ చెంది ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం కోరితే ఆర్ధిక వ్యవవహరాల్లో తగిన సూచనలు సలహలు అందచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో నేతి మహేశ్వర రావు, నూతల పాటి అమరనాథ్,  ఖాజారావు పావులూరి, నిఖిల్ మద్ది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి

-పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి -సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం -ఫిర్యాదుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *