Breaking News

పాలక ఫ్యాసిస్టు విధానాలపై పోరాటాలే మార్క్స్ ఎంగెల్స్ కు ఘనమైన నివాళులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఫ్యాసిస్టు విధానాలపై సామ్రాజ్యవాద ధోరణుల పైన నిరంతర పోరాటాలు సాగించడమే మార్క్స్ ఎంగెల్స్ లకు ఘనమైన నివాళి అవుతుందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. మార్క్సిస్టు సిద్ధాంత కర్త ఫెడ్రీక్ ఎంగెల్స్ 201 వ జయంతి సందర్భంగా ఆదివారం హనుమాన్ పేట కూడలి వద్ద ఉన్న మార్క్స్ ఎంగెల్స్ జంట విగ్రహాల వద్ద మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ స్మారక కమిటీ అధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. తొలుత విశాలాంధ్ర సంపాదకులు ఆర్ వి రామారావు వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్ వేణుగోపాల్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు లు విగ్రహాల వద్ద పూల రింగును ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్ వి రామారావు మాట్లాడుతూ మద్యలో ఆగిపోయిన మార్క్స్ రచనలను ఎంగెల్స్ కొనసాగించారని, నేడు ప్రపంచ వ్యాపితంగా మార్క్స్ రచనలపై చర్చలు పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. దోపిడి అసమానతలు నుండి సమాజాన్ని చైతన్యపరిచేది మార్క్సిజం మాత్రమేనని అన్నారు. ప్రపంచ వ్యాపితంగా సాగుతున్న సాంఘిక ఆర్థిక రాజకీయ కార్మిక పోరాటాలకు స్పూర్తి మార్క్సిజం ఒకటేనని అన్నారు. సీ హెచ్ బాబురావు మాట్లాడుతూ గత ఏడాది కాలంగా సాగుతున్న రైతు పోరాటానికి తలొగ్గిన మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేశారనీ,అయితే పార్లమెంట్ లో ఆమోదించాలని అన్నారు. రాబోయేది పోరాటయుగం అన్నారు. కరోనా వల్ల పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలు నష్టపోతే కార్పొరేట్ లు మరింత కోటేశ్వరులు అయ్యారని, కానీ కమ్యూనిస్టు ,సోషలిస్టు దేశాలు కోవిద్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది కోవిడ్ సంక్షోభం కాలంలో ఎంగెల్స్ ద్విశత జయంతి కార్యక్రమాలు నిర్వహణకు ఆటంకం ఏర్పడిందని అన్నారు. కమిటీ కన్వీనర్ బడ్డిగ జమీందారు,ప్రోగ్రెసివ్ ఫోరమ్ కార్యదర్శి ఎస్ హనుమంతరెడ్డి, సీపీఐ కృష్ణాజిల్లా సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ సంఘం కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు, ఎం బి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి యు వి రామరాజు, జన సాహితి కార్యదర్శి దివికుమార్, అరసం జిల్లా నాయకులు మోతుకూరి అరుణ కుమార్, ప్రజానాట్యమండలి నాయకులు సుబ్బారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాండురంగ ప్రసాదు, సీపీఐ నాయకులు నక్కా వీరభద్ర రావు, సయ్యద్ అఫ్సర్, పరగటి భాను, కల్లేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విఘ్నేశ్వరుని సన్నిధిలో దేవినేని ఉమా

-గొల్లపూడిలో వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *