Breaking News

డిసెంబర్ 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్… : కృష్ణాజిల్లా జడ్జి, డిఎల్ఎస్ఏ ఛైర్మెన్ రామకృష్ణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని,  కాలహరణం, ఆస్తి అన్యాక్రాంతం తదితర ముప్పులను సత్వరమే అధిగమించాలంటే, కక్షిదారులు రాజీ మార్గంలో అందరికి ఆమోదయోగ్యంగా కేసులను డిసెంబర్ 11వ తేదీన జరిగే  జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని   కృష్ణాజిల్లా జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గూడూరు రామకృష్ణ సూచించారు.

సోమవారం ఆయన తన చాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో  జిల్లాలోని వివిధ కోర్టు భవన సముదాయాలలో డిసెంబర్ 11వ తేదీ ( రెండవ శనివారం ) జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది కోవిడ్ కారణంగా కోర్టులు సరిగా  జరగకపోవడంతో కేసుల సంఖ్య అధికమయ్యాయని అన్నారు. కృష్ణాజిల్లాలో మొత్తం  89 వేల 171 కేసులు ఉన్నాయని వీటిలో తాము కనీసం 10 శాతం కేసులను పరిష్కరించే దిశలో తీవ్రంగా కృషి చేయనున్నట్లు జిల్లా జడ్జి ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు 5, 891ఉన్నాయని,  2 లక్షల రూపాయలు లోపు నెగోషిబుల్ ఇనుస్ట్రుమెంట్స్ యాక్ట్  సెక్షన్  138 ప్రకారం ఫైల్ చేసిన కేసులు 542 ఉన్నాయని, నెగోషిబుల్ ఇనుస్ట్రుమెంట్స్ యాక్ట్  సెక్షన్ 138 ప్రకారం పెండింగ్ లో ఉన్న కేసులు 3,629 కేసులు ఉన్నాయని, బ్యాంకు రికవరీ కేసులు 142 కేసులు, మోటార్ ఆక్సిడెంట్ క్లెయిమ్ ( నష్ట పరిహారం ) కేసులు 850 , భార్యాభర్తలు లేదా  పిల్లల పోషణ కోసం ఫైల్ చేసే కేసులు 1834 జిల్లావ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయని , భూసేకరణకు సంబంధించిన కేసులు 7 ,  కార్మిక వివాదాలకు సంసంబంధించి కేసులు ఏమీ లేవని సివిల్ కేసులు పరిశీలిస్తే, ఆర్ధిక సంబంధిత కేసులు 4, 105 కేసులు , యాజమాన్య హక్కులకు సంబంధించి  6019,  అప్పీలు సూట్స్  791, ఇతరత్రా సివిల్ కేసులు 1621 , తక్కువ మొత్తంలో ద్రవ్యసంబంధిత కేసులు ( ప్రామిసరీ నోట్లు ) 301 , ఎక్సయిజ్ కేసులు 2059 ఉన్నట్లు ఆయన ఉదహరించారు. డిసెంబర్ 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ కేసులను సత్వరం పరిష్కరించు కునేందుకు వేదికగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజీ పడదగిన, జరిమానాలు చెల్లించ దలచిన అన్ని సివిల్, క్రిమినల్, బ్యాంకు కేసులు, ప్రిలిటిగేషన్ కేసులు, ప్రమాద బీమా కేసులు తదితరాలను ఆ రోజున  పరిష్కరించే అవకాశం ఉందన్నారు. సివిల్‌ దావాలతోపాటు కుటుంబ వివాదాలు, మోటార్‌ ప్రమాదాల పరిహార కేసులను సులువుగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని, కక్షిదారులకు సత్వర న్యాయం లభించే విధంగా ఉభయ పక్షాల రాజీమార్గం ద్వార అప్పీలుకు తావులేని విధంగా పెండింగ్‌ కేసులను పరిష్కరించుకోవచ్చని కృష్ణాజిల్లా జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రామకృష్ణ తెలిపారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారం అయిన కేసులు తిరిగి మరో కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్నారు.లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రజలు తెలియజేసేందుకు న్యాయవాదులు లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్ పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *