Breaking News

స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్ణీత సమయంలోనే తప్పనిసరిగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులను పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
స్పంధన కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని రోజుల తరబడి పెండింగ్ లో ఉంచొద్దన్నారు . ఏవైనా మీ పరిధిలో పరిష్కారం కానీ సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో 11 ధరఖాస్తులు అందాయని ఆమె తెలిపారు.
స్పందన కార్యక్రమంలో గంపలగూడెం మండలం తోటమూల గ్రామస్ధులు వేములపల్లి రామాంజనేయులు తోటమూల గ్రామంలో గ్రామ సర్వే్ నెం. 33/2 లో 161.5 చ.గ. మలు భూమి ఉన్నదని దీనిని సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని చలానా డబ్బులు కూడా చెల్లించానని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, మండల సర్వేయర్ ను పంపించి తన భూమిని సర్వే చెేయించి తనకు న్యాయం చెయ్యాలని కోరుతూ అర్జీ అందజేశారు.
సిపియం పార్టీ నూజివీడు మండల కమిటీ నాయకులు జి. రాజు, సిహెచ్. రామారావు లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను ఆయా గ్రామ పంచాయితీలకు వెంటనే జయచేయాలని , ఆలాగే జి.వో నెం. 569 ని రద్దు చేయాలని గ్రామ పంచాయితీలలో అభివృద్ధి పనులకోసం నిధులను వెంటనే జమ చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
తిరువూరు మండలం రాజుపేట గ్రామంలో నివాసి పమ్మి రామారావు గ్రామ ఆర్.ఎస్. నెం. 176/4లో య.1.14 సెంట్ల భూమికి కె.డి.సి.సి. బ్యాంకు నుండి క్రాఫ్ లోన్ ఇప్పించమని కోరుతూ అర్జీ అందజేశారు.
గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామస్ధురాలు బత్తుల రమాదేవి గతంలో ప్రభుత్వం వారు బంజరుభూమి య.1.05 సెంట్ల వ్యవసాయం చేసుకోవడానికి పట్టా ఇచ్చారని, దీనిని సాగుచేసుకుంటున్నామని 2018వ సంవత్సరంలో ఎపిఐఐటిసి వారు దీనిని స్వాధీనం చేసుకుని సర్వే చేసినారని ఈ బంజరు భూమిని తీసుకున్నందులకు తమకు నష్టపరిహారం ఇప్పించమని కోరుతూ అర్జీ అందజేశారు.
నూజివీడులోని స్టేషన్ తోట వాస్తవ్యులు కొందరు తాము 40 సంవత్సరాలు నుండి గృహాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని మా రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకు వెళ్లాలంటే రెండు మలుపులు ఉన్నాయని ఒక మలుపు దగ్గర రోడ్డు మార్జిన్ పోరంబోకు స్ధలంను మాగంటి కనకారావు అనే వ్యక్తి ఆక్రమణ చేసి గోడకట్టాడని ఆపై ఇంటి నిర్మాణం కూడా చేపడుతున్నాడని అధికారులు స్పందించి ఆక్రమణను తొలగించి రోడ్డును విశాలపర్చాలని కోరుతూ అర్జీని అందజేశారు.
స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, డబ్ల్యూ ఆర్.డి.(ఎన్ఎస్పి) డిఇఇ పి.ఎస్. మూర్తి, వైద్యాధికారిణి డా. పి. అనూష, హౌసింగ్ డిఇఇ యం.వి. భాస్కరరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *