Breaking News

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా వాడ్రేవు చిన్నవీరభద్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ గా వి.చిన్నవీరభద్రుడు సోమవారం భాద్యతలు తీసుకున్నారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పి.రంజిత్ భాషా నుంచి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు చిన్నవీరభద్రుడు కి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ లొ 30 సంవత్సరాలు పైబడి వివిధ హోదాలలో పనిచేసి ఐఏఎస్ గాఎంపిక కాబడి విద్యా శాఖలొ SSA లో SPD గా మరియు విద్యా శాఖ డైరెక్టర్ గా రెండున్నర సంవత్సరాలు సేవలు అందించారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలములోప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నోసంస్కరణలు విజయవంతంగా పూర్తీ చేసి గుర్తింపు పొందియున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఫై పూర్తీ అవగాహన ఉన్నవ్యక్తి గా గిరిజన సంక్షేమ పధకాలను సమర్ధవంతంగా అమలు చేసి గిరిజనుల సర్వoతో ముఖాభివృద్ది కోసం కృషిచేయలనిఈ సందర్భంగా సిబ్బందికి సూచించుట జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కేంద్ర సహకారం.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతికి మహర్దశ

-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *