బాలల చట్టాల పట్ల అవగాహాన అత్యావశ్యకం : డాక్టర్ కృతికా శుక్లా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారుల హక్కుల పట్ల బాల నేరస్ధుల న్యాయ సంస్ధ, బాలల సంక్షేమ సంఘం సభ్యులు పూర్తి స్ధాయి అవగాహన కలిగి ఉండవలసిన అవశ్యకత ఉందని రాష్ట్ర వీధి బాలలు, బాల నేరస్తుల సంక్షేమం, దిద్దుబాటు సేవల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. చట్టాల పట్ల పూర్తి పరిజ్ఞానం సాధించగలిగినప్పుడు మాత్రమే పిల్లలకు తగిన న్యాయం చేయగలుగుతారని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన బాల నేరస్ధుల న్యాయ సంస్ధ, బాలల సంక్షేమ సంఘం అధ్యక్షులు, సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూనిసెప్ సంయిక్త భాగస్వామ్యంతో విజయవాడ హరిత బెరంపార్కు వేదికగా నాలుగు రోజల శిక్షణా తరగతులను సోమవారం ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కృతికా శుక్లా మాట్లాడుతూ బాలల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆక్రమంలోనే 13 జిల్లాలకు సంబంధించి ఈ కమిటీల నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేసామని వివరించారు. బాలల సంక్షేమ కమిటీలో ఒక చైర్‌పర్సన్, నలుగురు సభ్యులు ఉంటారని, జువెనైల్ జస్టిస్ బోర్డులో ఒక ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఇద్దరు సంఘ సేవకులు సభ్యులు ఉంటారన్నారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం కమిటీలు, అయా బోర్డుల అధ్యక్షులు, సభ్యులకు తప్పనిసరిగా పునశ్చరణను అందించవలసి ఉందన్నారు.

నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమంలో బాలల సంబంధిత చట్టాలతో పాటు జువెనైల్ జస్టిస్ చట్టం కింద వారు పోషించవలసిన భూమిక, బాధ్యతలపై శిక్షణ పొందుతారని డాక్టర్ శుక్లా పేర్కొన్నారు. అయా రంగాలకు చెందిన ప్రముఖులతో వీరికి శిక్షణ అందిస్తున్నామన్నారు. శిక్షణా తరగతులకు దాదాపు 85 మంది సభ్యులు హజరుకాగా గురువారం వరకు కార్యక్రమం జరగనుంది. సమావేశంలో యానిసెఫ్ ప్రతినిధి డేవిడ్, శాఖ సంయిక్త కార్యదర్శి ప్రసాద్, పూజ తదితరుల పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *