కారుణ్య నియామకం క్రింద 12 మందికి ఉద్యోగ అవకాశం…

-నియామకపు ఉత్తర్వులు అందించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ యొక్క విధులను నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ కోవిడ్-19తో మరణించిన 4 గురి కుటుంబ సభ్యులలో ఒక్కొకరి చొప్పున మరియు ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి స్థానములో 8 మందికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించుటలో భాగంగా నేడు కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలసి 12 మందికి కారుణ్య నియామకపు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భములో కమిషనర్ మాట్లాడుతూ మీ యొక్క విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, సోషల్ వర్కర్, టర్న్ కాక్, వాచ్ మాన్, శానిటరీ మేస్త్రి, పబ్లిక్ హెల్త్ వర్కర్ వంటి పోస్టింగ్ లను కేటాయిస్తూ వివిధ విభాగములలో పోస్టింగ్లు ఇచ్చుట జరిగిందని, మీరందరు విధి నిర్వహణలో బాధ్యతాయుతముగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) డా. జె.అరుణ, మేనేజర్ డి.వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *