Breaking News

దేవినగర్ నందు రూ. 41 లక్షల అంచనాలతో అభివృధి పనులకు శంఖుస్థాపన…

-పనులు సత్వరమే పూర్తి చేయాలి – నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ దేవినగర్ లో రూ.9.25 లక్షలతో ఆర్.సి.సి డ్రెయిన్ నిర్మాణ పనులకు మరియు రూ.31.75 లక్షల అంచనాలతో దేవినగర్ కాలువ అంచున ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాధారణ నిధులతో దేవినగర్ నందలి 5వ క్రాస్ రోడ్ నుండి 6వ క్రాస్ రోడ్ వరకు సుమారు 55 మీటర్ల పొడవున పాడైన డ్రెయిన్ నిర్మాణం మరియు దేవినగర్ కాలువ అంచున సుమారు 500 మీటర్ల పొడవున ఫెన్సింగ్ ఏర్పాటు చేయు పనులకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించుట జరిగిందని అన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వేగవంతముగా పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు. కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రయాణికుల సౌకర్యాలపై పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం, రైల్వే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *