-వైభవంగా శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
-వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వెల్లువిరిస్తున్న మత సామరస్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం దావు బుచ్చయ్యకాలనీలో శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ దేవి అమ్మవారు, శ్రీ మహా గణపతి మరియు శ్రీ నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కన్నులపండువగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని చెప్పుకొచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రభుత్వంపై ఎల్లవేళలా ఇదేవిధంగా ఉండాలని.. ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుకున్నారు. ఆది పరాశక్తి అమ్మవారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ జరిగింది. మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు జానారెడ్డి, కొంగితల లక్ష్మీపతి, ఆలయ ధర్మకర్త చింతపల్లి దుర్గారావు, దావుబుచ్చయ్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అజ్జా వెంకటేశ్వరరావు, నాయకులు చంటి, లక్ష్మీనారాయణ, శంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News