Breaking News

ఆర్బీకే లలో ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించండి : ఆర్బీకే సిబ్బందికి జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశం 

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆర్బీకే సిబ్బందిని ఆదేశించారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుతున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం కొలిచే యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ లో జిల్లాలో 8. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అందుకు అనుగుణంగా రైతులు ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన గొనె సంచులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకాలను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని పరిశీలించి ప్రజలకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పధకాలు పొందిన లబ్ధిదారుల జాబితాలను నోటీసు బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శనకు ఉంచాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయ పరిధిలోని అర్హులైన లబ్దిదారులకు వాలంటీర్లు అవగాహన కలిగించాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత, ఎల్. శివశంకర్, నూజివీడు రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ కె. రాజ్యలక్ష్మి, తహసీల్దార్ సి.హెచ్. నరసింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *