విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను డిసెంబర్ 3వ తేదిన విజయవాడ,మాకినేని బసవపున్నయ్య భవనం నందు కృష్ణా జిల్లా విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, అద్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఆశాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యాక్రమం లో పలువురు రాష్ట్ర మంత్రి వర్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొననున్నారన్నారు. కావున జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా నడుపబడుచున్న ప్రత్యేక పాఠశాలలో చదువుచున్న దివ్యాంగ పిల్లలు, జిల్లాలోని విభిన్నప్రతిభావంతలు కొరకు పనిచేయుచున్న అసోసియేషన్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా ఆ ప్రకటన లో ఆయన కోరారు.
Tags vijayawada
Check Also
ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్ వినియోగం
-విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో …
Prajavartha Online Telugu News