కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డు సచివాలయ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని, ఇది పునరావృతం అయితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు హెచ్చరించారు. సచివాలయ విధులలో సిబ్బంది కి అంకితభావం అవసరమని స్పష్టం చేశారు. కొవ్వూరు పట్టణంలోని 6వ, 7వ వార్డు సచివాలయాన్ని బుధవారం ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులపై తనిఖీ చేశారు. సరైన పారిశుద్ధ్య వ్యవస్థ లేకపోతే సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చెయ్యాలని, ఈ విషయంలో అలక్ష్యం అయితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు స్పందన ఫిర్యాదుల కు తప్పనిసరి గా రసీదు ఇవ్వాలని, అర్హతలేనివారికి తగిన కారణాలు వ్రాత పూర్వకంగా తెలియచేయాలని ఆదేశించారు. 90 శాతం పైగా ఫిర్యాదులు గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోనే పరిష్కారం అవుతాయన్నారు. అయితే తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ వద్దకు ప్రతి సోమవారం ప్రజలు ఫిర్యాదులు ఇస్తున్నారని పేర్కొన్నారు. రికార్డుల నిర్వహణకు సంబంధించి సచివాలయ ఆధికారిని ఆర్డీవో మల్లిబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది హాజరు, బయోమెట్రిక్ విధానంతో పాటు జాబ్ చార్టు అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసే చార్టులు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. పథకాలు ఆమలుతో పాటు లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకుని, తగిన సూచనలు చేశారు.. స్వయంగా ఆర్డీవో రికార్డులను పరిశీలించి ఉద్యోగులు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సి ఉందని స్పష్టం చేశారు. విధులకు గౌర్హాజరైతే శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను , వార్డు పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై వివరాలు అడిగారు.
Tags kovvuru
Check Also
“కంపెనీ Specific డ్రైవ్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ …
Prajavartha Online Telugu News