ప్రభుత్వం కల్పిస్తున్న పౌష్టికాహారం , సరుకులు అందించండం సక్రమంగా అమలు చేయాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం పిల్లల కు ఆహారం అందించడం, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న పౌష్టికాహారం , సరుకులు అందించండం సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండలం ఔరంగబాదు అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందచేస్తున్న ఆహార , బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అందచేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పధకం ద్వారా అందచేస్తున్నమని తెలిపారు. ప్రభుత్వం పిల్లలకు అందించే పౌష్టికాహారం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. అనంతరం వాటి వివరాలు తెలుసుకుని, రిజిస్టర్ లను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మెనూ ప్రకారం అందచేస్తున్న ఆహారం ను పరిశీలించి, అభినందించారు. అక్కడి చిన్నారులు, గర్భిణులు, బాలింతలతో మంత్రి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రంలో సకాలంలో సరకులు వస్తున్నాయా అని అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. అంగన్‌వాడీల పనితీరు, కేంద్రం పరిశుభ్రత తదితర వివరాలను తెలుసుకున్నారు. అంగన్‌వాడీలను స్వచ్ఛ అంగన్‌వాడీలుగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో లైటింగ్ తక్కువగా ఉండడంతో వెంటనే కేంద్రంలో ట్యూబులైట్ ను ఏర్పాటు చెయ్యాలని సీడీపీఓ మమ్మీ కి ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈసందర్భంగా అంగన్వాడీ లో పాలు తాగే 6 నెలల లోపు పిల్లలు 12 మంది, 7 నెలలు నుంచి 3 సంవత్సరాలు లోపు పిల్లలు 18 మంది, 4 నుంచి 6 సం. ములోపు ప్రీ స్కూల్ పిల్లలు 13 మంది , గర్భిణీలు 3, బాలింతలు 5 గురికి ఈ కేంద్రం ద్వారా సంరక్షిస్తున్నామని సిబ్బంది మంత్రికి తెలిపారు. సూపర్ వైజర్ సి.కనకవల్లి, అంగన్వాడీ టీచర్ పూర్ణిమ, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *