Breaking News

పున: ప్రారంభిస్తున్న ‘వై స్క్రీన్స్‌’ థియేటర్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడలో సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచు కుంటున్నాయి. మినీ థియేటర్ల వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చిన ‘వై స్క్రీన్స్‌’ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో థియేటర్లు రెండేళ్ల తరువాత శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సందర్భంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో సంస్థ అధినేత యార్లగడ్డ రత్నకుమార్‌ మాట్లాడుతూ ప్రేక్షకులకు మళ్లీ వినోదాన్ని అందించడానికి ఆర్టీసీ బస్టాండ్‌లోని ‘వై స్క్రీన్స్‌’ థియేటర్లు సిద్ధమయ్యాయని, డిసెంబరు 3వ తేదీ నుంచి సినిమాలు ప్రదర్శించనున్నామని తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లు తెరుస్తున్న నేపథ్యంలో ప్రేక్షక దేవుళ్ళు తిరిగి తమ థియేటర్లను ఆదరించాలని కోరారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో ఈ స్క్రీన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండేళ్ల పాటు అన్ని రంగాలు మూటపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. కోవిడ్ తొలిదశ తరువాత సినిమా హాళ్లు తిరిగి ప్రారంభం అయ్యేలోపు రెండో విడత కోవిడ్ విజృంభించడంతో ఇప్పటి వరకు థియేటర్లు తెరుచుకోలేదు. నెల రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలతో 100 శాతం సీటింగ్ కెపాసిటీ తో సినిమా హాళ్లు తెరుచుకోగా మరికొన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభానికి సిద్ధమయ్యాయి. విజయవాడ బస్టాండ్ లోని వై స్క్రీన్స్ గురువారం నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ అకాల మరణంతో ఆయన నివాళిగా ఒక రోజు అనంతరం శుక్రవారం నుంచి థియేటర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సంస్థ అధినేత యార్లగడ్డ రత్నకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధియేటర్‌ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడం రాజకీయ పతనానికి నిదర్శనం

-16 వేలకుపైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన లోకేష్‌ను చూసి ఓర్వలేక విషప్రచారం -ఐదేళ్లలో డీఎస్సీ ఇవ్వలేని జగన్‌.. ఇప్పుడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *