-నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ మరియు గురునానక్ నగర్ స్విమ్మింగ్ ఫూల్ నందు చేపట్టిన ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని పరిశీలిస్తూ, పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపించకుండా పనులు ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని సూచించారు. అదే విధంగా గ్రీనరి కూడా అభివృధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. తదుపరి ఇందిరాగాంధీ స్టేడియం రోడ్ నందలి ఫుడ్ కోర్ట్ సుందరీకరణ పనులను పరిశీలించి ప్రజలకు ఆకర్షనియంగా మరియు సౌకర్యవంతముగా ఉండేలా ప్రతి నిర్మాణం పట్ల శ్రద్ధ వహించావలెనని ఆదేశించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, వి.చంద్ర శేఖర్, స్పోర్ట్స్ ఆఫీసర్ & రీజీనల్ ఫైర్ అధికారి శ్రీ టి. ఉదయ్ కుమార్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సచివాలయం ఆకస్మిక తనిఖీ…
కమిషనర్ ప్రసన్న వెంకటేష్, గుణదల ప్రాంతములోని 1, 2 మరియు 3వ వార్డ్ సచివాలయాలను తనిఖి చేసినారు.. సచివాలయమునకు ప్రజల నుండి వచ్చిన సేవల అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించవలెనని, ఇంకను ప్రభుత్వం పథకములు అందని అర్హులైన లబ్దిదారులను గుర్తించి ఆన్ లైన్ నందు నమోదు చేసి వారికీ సంక్షేమ ఫలాలు అందునట్లుగా చూడవలెనని ఆదేశించారు. లబ్దిదారుల జాబితా, ముఖ్యమైన ఫోన్ నెంబర్ వివరాలు అన్నియు నోటీసు బోర్డు నందు ఉంచవలెనని అదేశించినారు.
Prajavartha Online Telugu News