విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా నిర్వహించుచున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవoలో భాగంగా స్థానిక CSC-E గవర్నెన్స్ వారు VR సిద్దార్ద కాలేజీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ముంగిటకు డిజిటల్ సేవలు అందుట ద్వారా జాతి అభివృద్దికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. అలాగే శిశు ఆధార్ ప్రారంభం అయిన నాటి నుండి 5 లక్షల మంది పిల్లలకు ఆధార్ సర్వీస్ అందించిన సందర్భంగా పోస్టర్ మరియు మ్యాగ్సిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా CSC అధికారులు కమీషనర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమములో CSC అధికారులు మరియు VLE లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News