Breaking News

దివ్యాంగులకు అండగా జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గాపురంలో ఏపీ రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వికలాంగులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా సంఘం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల‌కు సమాన అవకాశాలు, హక్కులు కల్పించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే దివ్యాంగులకు నెలవారీ పెన్షన్‌ రూ.3 వేలకు పెంచినట్లు తెలిపారు. వారంతా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రత్యేక నిధులు కేటాయించి దివ్యాంగుల పట్ల సేవా నిరతిని చాటుకుంటున్నారన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలను పొందేవిధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి సెంటర్లు, వృత్తి విద్యా ట్రైనింగ్‌ ‌సెంటర్లలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని, అన్నిరంగాల్లో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం నిలబెట్టే ఏకైక ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వమని మరోసారి పునరుద్ఘాటించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కొండాయిగుంట మల్లీశ్వరి, బాలి గోవింద్, నాయకులు బంకా భాస్కర్, శనగశెట్టి హరిబాబు, మందా రాము, ఏపీ రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా సంఘం నాయకులు అడబాల రాజు, బండారు దుర్గారావు, సుబ్రహ్మణ్యం, ఆంటోని, ఉండవల్లి చందు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్సను అందించాలి

-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి -ఈహెచ్‌ఆర్‌ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం -వినియోగంపై ఎన్ ఎం సి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *