Breaking News

జగనన్న పాలవెల్లువ’ లక్ష్యసాధనకు అధికారులు కృషి చేయాలి…

-జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…
-రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి…
-కలెక్టరు జె. నివాస్

పామర్రు,(జుజ్జువరం), నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. పామర్రు మండలం జుజ్జవరం గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం కలెక్టరు జె. నివాస్ అధికారులతో కలసి జగనన్న పాలవెల్లువ, ఓటీఎస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల అంశాలపై లబ్దిదారులకు అవగాహన కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లవ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో తొలి విడతగా 303 గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలే సంఘాలుగా ఏర్పడి పాలసేకరణ చేసి డేయిరీకి పంపిస్తారన్నారు. దీని వల్ల వారికి ప్రస్తుతం పోస్తున్న డెయిరీల కంటే లీటరుకు రూ. 5 నుంచి రూ. 7 రూపాయల వరకు అధిక ధర లభిస్తుందన్నారు. 11 మంది సభ్యులతో మహిలా డెయిరీ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాలు పోసిన వారికి ప్రతి పది రోజుల కొకసారి వారి అకౌంట్ నందు సొమ్మును జమ చేస్తామన్నారు. జిల్లాలోని జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలతో పూర్తి చేయాలన్నారు. అమూల్‌ పాల వెల్లువ కార్యక్రమానికి సంబంధించి డేటా ఎంట్రీ నిమిత్తం గ్రామానికి దగ్గరలోనే గదిని గుర్తించాలని, విద్యుద్దీకరణ, ఇంటర్నెట్‌ సదుపాయాలు కలిగించాలని సంబంధిత ప్రత్యేక అధికారులను ఆదేశించారు. తహశీల్దార్లు, ఆర్‌ఐలు, వెటర్నరీ డాక్టర్లు, ప్రత్యేక అధికారులు సంయుక్తంగా పాల శీతలీకరణ కేంద్రాల యూనిట్లను గుర్తించాలన్నారు. పాలశీతలీకరణ కేంద్రాలను ఉపాధి హామీ ద్వారా నిర్మించాలని చెప్పారు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించాలని, ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు అవగాహన కలిగించాలన్నారు. సొసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించాలని, ఆన్‌లైన్‌ ద్వారా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. మంచి ఆరోగ్యవంతమైన ఆవులు, గేదెలను కొనుగోలు చేయాలన్నారు. ట్యాగ్‌ ఉన్న పశువులను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు. వాటిని వెటర్నరీ డాక్టర్లు సర్టిఫై చేయాలన్నారు. వాటికి ఇన్సూరెన్స్‌ చేయించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన పశువుల ఆరోగ్య పరిస్థితిని గమనించాలన్నారు. రాష్ట్రంలో 8 జిల్లాలో ప్రారంభించారన్నారు. పాలు పోసిన మొదటి రోజునుంచి ఎక్కువ ధర వస్తుందన్నారు. కృష్ణాజిల్లాలో 34 వేలమంది రైతులు ఉన్నారని ఈ పథకం ద్వారా వీరందరికీ లబ్ది చేసూరుతుందని కలెక్టరు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న పాల వెల్లువ పథకాన్ని శివారు ప్రాంతాల్లో అవగాహన పెంపొందించే బాధ్యత ఎంపీడీవోలు తీసుకోవాలన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి 45 నుంచి 60 ఏళ్ల లోపు బిసి, ఎస్‌సి, మైనార్టీలు, వితంతువులు అర్హులని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. అమూల్‌ సంస్థ పాలను కొనుగోలు చేస్తుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ చేయూత దరఖాస్తులను బ్యాంకులు నిర్ణీత సమయంలో లోగా గ్రౌండ్‌ చేయాలన్నారు.

జగనన్న శాశ్వత గృహహక్కు పథకాన్నిలబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి.. కలెక్టరు
జిల్లాలో జగనన్న శాశ్వత గృహ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 10 వేల మంది లబ్దిదారులు సద్వినియోగం చేసుకున్నారన్నారు. మరో 60 వేలమంది ఎంపిక అయ్యారన్నారు 2012 ముందు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇళ్లు నిర్మించుకుని వారికి గృహనిర్మాణ సంస్థలో ఎంత అప్పు ఉన్నా పది వేల రూపాయలు చెల్లిస్తే వారి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి వారికి శాశ్వత హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు ఓ టి ఎస్ పథకం కింద లబ్ధిదారులకు అర్హత పత్రాలను కలెక్టర్ అందజేశారు.

ఆర్బీకేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. కలెక్టరు
జిల్లాలో 734 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు వారు పండించిన ధాన్యాన్ని ఈ కేంద్రాలు ద్వారా విక్రయించుకోవచ్చున్నారు. రైతులు వారు సొంతగా మిల్లులకు ధాన్యాన్ని తీసుకువెళితే ట్రాన్స్ పోర్టు ఛార్జీలను అదేవిధంగాహమాలి ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లింస్తుందన్నారు. ఆర్బీకేల్లో గొనే సంచులను రైతులకు అందుబాటు ఉంచాన్నారు.

సచివాలయాన్ని సందర్శించిన కలెక్టరు…
సమావేశం అనంతరం కలెక్టరు జె. నివాస్ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం ద్వారా లబ్దిదారులకు అమలు జరుగుతున్న పథకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎంత మంది కోవిడ్ వ్యాక్సినేషన్ వేసారని ఆరా తీయగా ఇప్పటి వరకు 1850 మంది రెండు మోతాదులు వేసామని మరో 70 మందికి రెండో మోతాదు వేయాలని సచివాలయ ఏఎన్ఎమ్ కలెక్టరు కు వివరించింది. ఈ సందర్భంగా కలెక్టరు జె.నివాస్ సచివాలయం డిస్పే బోర్డులో ప్రభుత్వ పథకాలు, లబ్దిదారుల వివరాలు తెలియజేసే డిజిటల్ బోర్డులను పరిశీలించారు. సమావేశంలో పలువురు గ్రామ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ దాసర అశోక్ కుమార్, గ్రామ సర్పంచి పుట్టి పున్నమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి లక్ష్మీ నాంచారమ్మ, తాసిల్దారు సురేష్ బాబు, ఎంపీడీవో వై రామకృష్ణ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పశు సంవర్థకశాఖ సంయుక్త సంచాలకులు మేనేజర్లు, ప్రత్యేక అధికారులు, ఎపిఎంలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చాగంటిపాడులో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాల పంపిణీ -రూ.9.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *