Breaking News

డా.బి.ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు/అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ ఘన నివాళులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత, సమసమాజ స్వాప్నికుడు, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 65 వ వర్ధంతి సందర్భంగా సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు/అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ మాట్లాడుతూ భారతదేశ సమగ్ర భౌగోళిక సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకొని బడుగుబలహీన వర్గాలకు సమ న్యాయం జరిగేలా రాజ్యాంగ రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, నీకోసం జీవీస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే శాశ్వతంగా జీవించే ఉంటావు అని చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపి సమాజంలో పీడిత వర్గాల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి వారికి అండగా ఉండి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన కోరారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు,రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, మేధావి, భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించాలన్నదే “గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌”లక్ష్యమని ఆ దిశగా తాము ముందడుగు వేస్తున్నట్లు ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రణవ్ జైసూర్య, వి.రమేష్, షేక్ జుబేధా బేగం, భారతి, సౌజన్య, దుర్గ, శ్రీదేవి, అపర్ణ లతోపాటు భారీ సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *