భావితరాలకు స్ఫూర్తిదాయకం అంబేద్కర్ జీవితం…

-మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భావి తరాలకు అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి వారి కళాక్షేతం వద్దన గల అంబేద్కర్ విగ్రహనికి మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణు తదితరులతో కలసి మేయర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత దేశానికి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు.

విద్యార్ధి చదువుకు ఫౌండేషన్ ద్వార ఆర్ధిక చేయూత… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఛాంబర్ నందు విద్యాదాత ఫౌండర్ ద్వారా 46వ డివిజన్ పరిధిలోని సెయింట్ థామస్ పబ్లిక్ స్కూల్ నందు చదువుతున్న అఖిల్ అనే విద్యార్ధికి, 10వ తరగతి చదువుకొనుటకు కావలసిన ఆర్ధిక సహాయము అందించినారు. కార్యక్రమములో విద్యాదాత ఫౌండర్ తమ్మిన రవీందర్ పాటు మరియు కామరాజు హరీష్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“కంపెనీ Specific డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *