విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ నివాళులర్పించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశంలో కుల, మత, ప్రాంత, భాష అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించారాని, అంబేద్కర్ గారు పేద ధనిక తేడా లేకుండా అందరికీ హక్కులు ఒకే లాగా వర్తించేలాగా రాజ్యాంగం రూపొందించిన మహోన్నతమైన టువంటి వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ysrcp ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంక్ గా వాడుకుంటూ వారి ఆత్మ గౌరవం ,అభివృద్ధి పూర్తిగా విస్మరించిందని, దళితులపై దాడులు రాష్ట్రంలో విపరీతంగా పెరిగాయని, దళితుల పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసే స్థాయికి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళింది ఆంటే దళితులపై వర్క్ ఉన్న చిత్తశుద్ధి ఎంతో అర్థమవుతుందని, అదేవిధంగా విదేశీ విద్యా పథకం, సబ్సిడీ రుణాలు మంజూరు, పెళ్లి కానుక పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని,సుచరిత గారికి హోం శాఖ కేటాయించినది ఇది కేవలం ప్రచారం కోసం మాత్రమేనని, పవర్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వద్ద కేంద్రీకృతమైందని, హోం శాఖ మంత్రి గారు హోంగార్డు ను కూడా నియమించలేని పరిస్థితిలో ఉన్నారని, ఇదేనా దళిత మహిళకు ఇచ్చే గౌరవం ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంయుక్త కార్యదర్శి నెమల సంజీవరావు, నగర ఉపాధ్యక్షులు వెన్నా శివశంకర్, నగర కమిటీ సభ్యులు, కొర్ర గంజి వెంకటరమణ, కృష్ణ మోహన్, దుర్గ భవాని, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ కృష్ణ, స్టాలిన్, బాదరాల శివ, గంగాధర్, ఏలూరు శరత్, మూర్తి, పండు, నాగబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News