-ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ వర్థంతి కార్యక్రమం
-మల్లాది విష్ణు చేతుల మీదుగా చిన్నారులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శాసనసభ్యులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళ నాయకురాలు మేడేపల్లి ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతులమీదుగా చిన్నారులకు ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, పండ్లు, పెన్సిల్స్ పంచిపెట్టారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం, కుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. గత చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. పౌరుల కనీస ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసిందని గుర్తుచేశారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ పాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల యొక్క అన్ని హక్కులను రాజ్యాంగపరంగా కాపాడుతున్నారన్నారు. అంబేద్కర్ స్పూర్తితో సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు సోమసుందరం, నారాయణ రావు, రమణి, రాధ, పూర్ణిమ లత, ఏ. ఎస్. నాయుడు, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News