-జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట గ్రామ సచివాలయాలను తనిఖి చేసిన జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో సాధికారత సాధించడంలో సర్వే ఆఫ్ విలేజెస్, మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్‌డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(svamitva) ఎంతో దోహదపడుతుందని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట గ్రామంలో స్వామిత్వ అమలు తీరును మరియు గ్రామ సచివాలయం -1&2 లను బుధవారం జాయింట్ కలెక్టరు(అభివృద్ది ఎల్.శివశంకర్ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం స్వమిత్వ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకంలో గ్రామీణ ప్రజల ప్రాపర్టీని ఆర్థిక సంపదగా గుర్తిస్తారని, తద్వారా వారికి బ్యాంకుల్లో రుణాలు పొందడం తదితర ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. స్వమిత్వ ద్వారా గ్రామాల్లోని ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు ప్రభుత్వ రంగ ఆస్తుల వివరాలను కూడా సరిహద్దులతో సహా నిర్ణయిస్తారని తెలిపారు. ప్రతి ఇంటితో పాటు రోడ్లు, చెరువులు, పార్కులు, దేవాలయాలు, అంగన్‌వాడీ, హెల్త్ సెంటర్, పంచాయతీ కార్యాలయం లాంటి అన్ని ఆస్తులను ఈ సర్వేలోకి చేర్చనున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా తమ సొంత ఇళ్లపై బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు జరపలేకపోతున్న వారికి స్వమిత్వ ప్రాపర్టీ కార్డుల ద్వారా ఆ లోటు తీర్చాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ కార్డులను ప్రజలకు పంపిణీ చేసేందుకు గ్రామాల్లో స్వమిత్వ సర్వే వేగవంతం చేస్తున్నామన్నారు.
గ్రామ సచివాలయాలను సందర్శించిన జాయింట్ కలెక్టరు శివశంకర్
జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట గ్రామ సచివాలయం1,2లను జాయింట్ కలెక్టరు ఎల్. శివశంక్ ఆకస్మిక తనిఖీ చేసి సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ సర్వీసుల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా జగనన్న సంపూర్ణ శాశ్వత గృహహక్కు పథకం(ఓటీఎస్) జగనన్న పాలవెల్లు, జగనన్న స్వచ్చసంకల్పం, స్వమిత్ర వంటి పలు అంశాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సర్వీసులు ఎన్నివున్నాయో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రదర్శన బోర్డుల్లో ఉంచాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల బోర్డులను అర్హుల జాబితాలను క్రమ పద్దతిలో డిస్పై బోర్డుల్లో ప్రదర్శించాలన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచి ఉన్నందున ఇంకా వ్యాక్సిన్ వేయించుకొని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ వేయాలని వాలంటీర్లు, ఏఎన్ఎమ్, సచివాలయ సిబ్బందిని ఆదేశేంచారు. జాయింట్ కలెక్టరు వెంట తాహశీల్థారు వైకుంఠరాపు, పంచాయితీ కార్యదర్శి కె.వి.సుబ్బారావు, సర్వేయర్లు, సచివాలయసిబ్బంది తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News