Breaking News

పవన్ కళ్యాణ్ కి రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువ…. : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ విశాఖ స్టిల్ ప్లాంట్ పై పోరాడతారా లేక పారిపోతారో వై ఎస్ ఆర్ సి పి నాయకులు సమాధానం చెప్పాలని, ఢిల్లీలో రగ్గులు కప్పుకొని పార్లమెంట్ లో పోరాడకుండా దాక్కుంటారా? అని పార్లమెంటు సమావేశాలకు వీళ్లు మొక్కుబడిగా వెళ్తున్నారని, ప్రజా సమస్యలు, ప్రజల భావోద్వేగాలతో పని లేదఅని,తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం పార్లమెంటులో నటిస్తారని, ప్రతి సెషన్ లో ప్రతిసారి ప్రధాని మోదీ  దగ్గరకు విజయసాయి రెడ్డి వెళ్లి ఒక ఫోటో తీసుకొని వస్తారు తప్ప రాష్ట్రం గురించి మాట్లాడరని, వెళ్లి ఏమి అడుగుతారో అందరికీ తెలుసని, AP ప్రజలను మోసం చేసేలా హామీలు ఇచ్చి ysrcp గెలిచిందని, 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం విశాఖ ఉక్కుఅని, పవన్ కళ్యాణ్ కి రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువ అని,మోసం మాయ దగా తెలియవు పోరాడటం మాత్రమే తెలుసని,లెక్కలు వేసికొని పోరాడతున్నట్లు నటించడం ys జగన్ కి మాత్రమే తెలుసఅని, అఖిల పక్షం వేసే దమ్ముందఅని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసి పోరాడడం అంటె పరిపోతున్నారని, అంబటి రాంబాబు అనే ఒక ఎమ్మెల్యే ఉన్నారాని, అతను జగన్ మెప్పు కోసం కులాన్ని దూషించారని. అతనొక కుల ద్రోహిఅని, ప్రపంచంలో ఎవరు అతనిలాగా ఫోన్లో మాట్లాడలేరని, అలాంటి సంస్కార హీనులు కూడా మా పార్టీ అధ్యక్షులు గురించి మాట్లాడుతున్నారని, మంత్రి వర్గ విస్తరణలో స్తానం ఉంటుందని ఆశ పడి రాంబాబు  ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని, మీ కల కల గానే మిగిలిపోతుందని, పవన్ పై విమర్శలు అపి స్టీల్ ప్లాంట్ పై స్పందించలని, మీ హావభావాలు చూసిన వారందరూ మీరు నాయకుడిగా కన్నా నాటక రంగంలో బాగా రాణిస్తారని, మీ సత్తెనపల్లి నియోజక వర్గంలో ఈ రెండున్నర సంవత్సరాలలో సాధించిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని, హోం శాఖ మంత్రి సుచరిత  మనస్సాక్షి తో స్పందించాలి, కేవలం ప్రచారం కోసం దళిత మహిళకు హోంశాఖ కేటాయించి హోం శాఖకు సంబంధించిన అధికారమంతా సజ్జల రామకృష్ణారెడ్డి  చేలయించడం వాస్తవం కాదఅని, హోంగార్డు ను కూడా నియమించే అధికారం లేని హోంశాఖకు సూచరిత ని మంత్రిని చేసిందీ కేవలం ప్రచారం కోసం మాత్రమేనని, ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా గుంటూరు జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి  చేయడం వాస్తవం కాదఅని, ఆ కార్యక్రమాలకు మీరు హాజరు కాకపోవడం వాస్తవం కాదఅని, మీ మనస్సాక్షి తో ఒకసారి cm జగన్ ని ప్రశ్నించలని, విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేయొద్దని, రాజధాని అమరావతి గానే ఉండాలని, రైతులకు నష్టపరిహారం సకాలంలో చెల్లించాలని పవన్ కళ్యాణ్  పోరాడుదాం ఉద్యమించడం వారు చేస్తున్న తప్పా సుచరిత  స్పందించాలి మహేష్ డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *