అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి. నేటి నుంచి వరసగా మంచి ముహూర్తాలు రావడంతో పెళ్లిళ్లు చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే అనుకుని ఉన్న సంబంధాలు ఈముహూర్తాలలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఎక్కువగా ఏప్రిల్, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. గురుమూఢం రావడంతో మార్చి 18 వరకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. ఆ తరువాతే పెళ్లిళ్లకు మంచి రోజులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. మార్చిలో 6రోజులు, ఏప్రిల్ లో 14 రోజులు, మేలో 11 రోజులు, జూన్ లో 13 రోజులు, ఆగస్టులో 10 రోజులు, డిసెంబర్ లో 9 రోజులు మంచి ముహూర్తాలు ఉన్నట్లుగా పురోహితులు చెబుతున్నారు. సెప్టెంబర్- నవంబర్ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. కరోనా కారణంగా ప్రస్తుతం ఉన్న ముహూర్తాల్లోనే అనుకున్న సంబంధాలకు పెళ్లిళ్లు చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్లీ కరోనా వల్ల ఎప్పడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకపోవడంతో… ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ముహూర్తాలు రావడంతో పెళ్లిళ్లపై ఆధారపడి ఉన్న వ్యాపారాలకు ఎంతోకొంత ఉపాధి ఉంది
Tags amaravathi
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …