Breaking News

స్పందనకు హాజరుకాని అధికారులపై చర్యలు: ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి హెచ్చరిక…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులను ఆర్డీఓ స్వీకరించారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి పలు శాఖల అధికారులు హాజరుకాకపోవడం, కొన్ని శాఖల అధికారులు ముందస్తు అనుమతి తీసుకోకుండా స్పందన కార్యక్రమానికి గైరుహజరై, తమ కింద స్థాయి సిబ్బందిని పంపడంపై ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ శాఖలైన రోడ్లు, భవనాలు, డివిజినల్ పంచాయతీ అధికారి, ఐసీడీఎస్, గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్యం, పశుసంవర్ధకం, అటవీ, ట్రాన్స్ కో, కార్మిక శాఖ, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూ ఎస్, తదితర శాఖల అధికారులు గైరుహజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపాలని కార్యాలయ పరిపాలనాధికారిని ఆర్డీఓ ఆదేశించారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారవేదిక స్పందన కార్యక్రమానికి డివిజనల్ స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావలసిందేనన్నారు. హాజరు కానీ అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతమైతే సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలకు సిఫారసు చేయడం జరుగుతుందని ఆర్డీఓ హెచ్చరించారు.
నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన దావులూరి ఝాన్సీలక్ష్మి తన దరఖాస్తులో తన తల్లి నుండి సంక్రమించిన 7 సెంట్లు స్థలంలో కొంత భాగాన్ని పక్క స్థలం వ్యక్తి ఆక్రమించుకున్నాడని, వెళ్లి అడిగితే తనను దుర్భాషలాడి, తనపై చేయి చేసుకున్నాడని వాపోయింది. ఈ విషయాన్నీ పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖాధికారులను ఆర్డీఓ ఆదేశించారు. తెల్లదేవరపల్లి పిహెచ్ సి లో ఆప్తాల్మిక్ ఆఫీసర్ గా 26. 9. 2020వ తేదీన నియామకమయ్యానని తాను జాయిన్ ఐన తేదీ నుండి ఇప్పటి వరకు ఒక్క నెల జీతం రాలేదని పి. దివ్య విన్నవించింది. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కోరారు. నూజివీడు మండలం పొలాసానిపల్లి గ్రామ సచివాలయంలో వి ఆర్ ఓ గా పనిచేస్తున్న రంగారావు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని,అక్రమ మట్టి తోలకంను ప్రోత్సహిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేసారు. ఈ విషయంపై వెంటనే విచారణ చేసి సంబంధిత వి ఆర్ ఓ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. కొత్త ఈదర గ్రామంలో తన భూమిలోని వెళ్లే దారి లేకుండా కొంతమంది ఫెన్సింగ్ మూసేసారని, తనకు న్యాయం చేయాలనీ కోరగా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. నూజివీడు మండలం వెంకటాయపాలెం, ఓగిరాలతండా, కొత్తూరుతండా, లైన్ తండా గ్రామస్తులు తమ దరఖాస్తులో తమ గ్రామాలలో నిర్మించనున్న గ్రామ సచివాలయ కార్యాలయాలు ఓగిరాలతండా లోనే నిర్మాంచాలని పంచాయతీ తీర్మానించగా, అందుకు విరుద్ధంగా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో వేరే ప్రదేశంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ అందరికీ అందుబాటు ప్రదేశమైన ఓగిరాలతండా లోనే నిర్మించాలని కోరగా, పరిశీలించి సమస్య పరిష్కారదిశగా కృషి చేస్తానని ఆర్డీఓ రాజ్యలక్ష్మి చెప్పారు.
స్పందన కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల శాఖాధికారి పార్వతి, డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, వివిధ శాఖలకు చెందిన కిందస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *