విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 1000రోజులు పాలనలో 1000 నేరాలు పై, 2022 బడ్జెట్ పై విలేకర్ల సమావేశం అనంతరం సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ వాణిజ్య విభాగం నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభ ఆదివారం విజయవాడ, హనుమాన్ పేట లోని సాంబమూర్తి రోడ్డు చివర, పాత గవర్నమెంట్ హాస్పటల్ వెనక ఆలపాటి రామారావు AC ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపి పోలిట్బ్యూరో సభ్యుడు,Ex. MLA బొండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తన 1000రోజుల పాలనను ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి ఇప్పటి వరకు దేవాలయాలు , అంబేద్కర్ , ఎన్టీఆర్ వంటి మహనీయుల విగ్రహాలు కూల్చడం , తెదేపా కార్యాలయంపై దాడిచేయడం వంటివి చేస్తూ జగన్ తన విధ్వంసకాండను కొనసాగిస్తున్నారన్నారు అన్నారు. దళిత డాక్టర్ సుధాకర్ చిత్రహింసలు పెట్టారని , వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డిపైనే ఎదురు ఆరోపణలు చేస్తున్నారని, ప్రశ్నించిన పత్రికలకు సంకెళ్ళు వేస్తూ తనకు ఎదురుతిగితే ఎంతటివారికైనా తిప్పలు తప్పవనే సందేశంతో పరిపాలన సాగిస్తున్నారన్నారు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణాలను నిలిపివేసి , ఇసుక కొరత సృష్టించి రాష్ట్ర ప్రజలకు ఉపాధి లేకుండా చేసి భావితరాల భవిష్యత్తును, కార్మికుల ఉపాధిని నాశనం చేసిన జగన్ రాక్షసానందం పొందుతున్నారన్నారు. మధ్యపాన నిషేధం అని చెప్పిన జగన్ విపరీతంగా మద్యం షాపులు పెంచారని, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు ఏ.పిని నిలయంగా మార్చారన్నారు. జగన్ పాలనలో రోజుకొక మహిళపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ స్లబ్ నిధులు నిలిపివేసిన ఘనుడని, డ్వాక్రా మహిళల అభయహస్తం డబ్బులు కాజేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు. ఇసుక ధరను బంగారం ధరకంటే అధికంగా అమ్ముతున్నారని, అయినా ఇసుక దొరకే స్థితి లేదన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రప్రజలకు ఉపాధి దొరకడం, ధరలు అందుబాటులో ఉండటంతో ఆదాయం పెరిగి ఇళ్ళు కట్టుకోవాలనే ఆలోచనతో ఉండేవారని, జగన్ పాలనలో ఇల్లు గడిస్తే చాలు అనుకునే స్థితికి ప్రజలను తెచ్చారన్నారు. 2022 బడ్జెట్ లో ప్రజలకు ఉపయోగం లేదని, సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున బడ్జెట్ ప్రవేశ పెట్టాము అని చెప్పే వైసీపీ నాయకులు ముందు గత సంవత్సరం ఇవ్వవలసిన అమ్మ ఒడి బకాయిలు ఎందుకు ఇవ్వలేదని చెప్పాలి అన్నారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఎక్కడో కొంతమందికి మాత్రమే ఇచ్చి ప్రచారాలు మాత్రం ఆర్భాటంగా చేసుకుంటున్నారు అని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తుసుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమానంగా సాగించి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని అన్నారు.
అనంతరం సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ వాణిజ్య విభాగం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా పేర్ల రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస గుప్త, కోశాధికారి గా మద్దినెని సుబ్రమణ్యం మరియు 90మందితో కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్లు ముప్పా వెంకటేశ్వరరావు, పిన్నమ్రాజు త్రిమూర్తిరాజు, ఎరుబోతు రమణ, కాకు మల్లికార్జునరావు, నేతలు తుమ్మలపెంట శ్రీను, నందేటి చంద్ర భాను సింగ్, గరిమెళ్ళ చిన్న, దాసరి ఉదయశ్రీ, శంకర మనోజ్, బడేటి ధర్మారావు, ఎలక్ట్రికల్ బుజ్జి, ఆర్యవైశ్య నాయకులు ముక్తేశ్వరరావు, మెడికల్ అసోసియేషన్ పృద్వి తదితరులు పాల్గొన్నారు.