ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులను ఈనెల 14 సోమవారం స్వీకరించడం జరుగుతుంది…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్, మండల స్థాయి కార్యాలయాల్లో ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులను ఈనెల 14 సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఫిర్యాదు లను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలన్నారు. మండల స్థాయి అధికారులు సంబంధించిన కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండాలని, ప్రతి ఫిర్యాదుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *