విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ,ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గలోని 12 వ డివిజన్లో అయ్యప్ప నగర్ లో దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబనికి నాలుగు కుటుంబాలకు రెండు తోపుడు బండ్లు, ఒక కూరగాయల బండి, ఒక ఇస్త్రీ బండి నీ స్థానిక వై.సి.పి ఇంచార్జి మాగంటి నవీన్ కుమార్ తో కలిసి అవినాష్ పేద కుటుంబాలకు అందించారు. జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ తరపున 2 లక్షల రూపాయల విలువ గల తోపుడు బండి ,ఇస్త్రీ బండ్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు అండగా నిలవాలనే ఆయన ఆశయాలకు అనుగుణంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు రిజ్వాన్,ధనికుల కాళేశ్వర రావు,లగపూడి శేషగిరి రావు, గుళ్ళపల్లి వెంకటేశ్వర రావు, గాడి నారాయణ రావు , తుమ్మల కృష్ణా రావు,అత్తల్లూరి బ్రహ్మయ్య, కంచెర్ల సుగుణఈశ్వర రావు, మద్దాల రాజశేఖర్, గఫ్ఫర్, అబ్దుల్ రెహ్మాన్, విశ్వనాధపల్లి వెంకటేశ్వర రావు, అబ్దుల్ ఖలీం, షేక్ బషీర్,చిన్న, లోవ రాజు తదితరులు పాల్గొన్నారు
