విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్ధ్య గృహోపకరణాలు…ప్రత్యేక అధ్యయనం

-ఈ ప్రతిపాదన పై డిస్కాములు , సిఈఈడబ్ల్యు తో చర్చించిన ఏపీఈఆర్సి
ఈ పథకం అమలు చేసేందుకు దోహదపడే ఉత్తమ ఫైనాన్సింగ్ మోడల్ ను రూపొందించండి- డిస్కాములకు ఏపీఈ ఆర్స్ చైర్మన్ జస్టిస్ సి వీ నాగార్జున సూచన
-ఇంధన సామర్ధ్య గృహోపకారణాలతో విద్యుత్ వినియోగం తగ్గుదల.. విద్యుత్ బిల్లుల ఆదా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు
-డిస్కాముల పై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా గృహోపకరణాల పథకం అమలు
-ఏపీఈఆర్సి యోచన
-స్వచ్చందంగా ముందుకు వచ్చే వినియోగదారులకు ఈ పథకం వర్తింపు
-వినియోగదారుల పై భారం లేకుండా విద్యుత్ బిల్లులో ఆదా ద్వారానే తిరిగి చెల్లింపులు చేసే అవకాశం
-ఈ పథకం అమలుకు సహకరించేందుకు ముందుకు వచ్చిన సి ఈ ఈ డబ్ల్యూ
-ఆసియా లో అత్యుత్తమ సంస్థ గా సి ఈ ఈ డబ్ల్యూ కి గుర్తింపు
-ఎనర్జీ ఎఫిసిఎన్సీ ప్రయోజనాలు ప్రతి వినియోగదారునికి అందాలి – ఏ పీ ఈ ఆర్ సి
-ఎనర్జీ ఎఫిసిఎన్సీ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ ది క్రియాశీలక పాత్ర –సి ఈ ఈ డబ్ల్యూ
-సూపర్ ఎఫిసియెంట్ ఫ్యాన్లు వాడటం ద్వారా రాష్ట్రంలో వచ్చే పదేళ్లలో 7000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా కు అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులను ఇంధన సామర్థ్య గృహోపకరణాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రేగులటరీ కమిషన్ (ఏపీఈఆర్సి) అనేక కీలక చర్యలు తీసుకుంటుంది. ఇందు కోసం ఒక ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ ను రూపొందించాల్సిందిగా డిస్కాములకు సూచించింది.దీని పై సంపూర్ణంగా అధ్యయనం చేయాలని సలహా ఇచ్చింది .

ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఏపీఈఆర్సి ముందు వరసలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ ప్రతికూలతలు నివారించడం లో ఎనర్జీ ఎఫిసిఎన్సీ కీలక పాత్ర పోషిస్తుందని ఏపీఈఆర్సి భావిస్తుంది. వినియోగదారులు ఇంధన సామర్థ్య గృహోపకారణాలను ఉపయోగించాల్సిన ఆవశ్యకత పై దృష్టి సారించింది. ఈ విషయమై వినియోదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్దిష్టమైన ఫైనాన్సింగ్ మోడల్ ను అధ్యయనం చేసిన పిమ్మట ఒక నివేదికను రూపొందించి ఏపీఈఆర్సికు సమర్పించవల్సిందిగా ఆదేశాలిచ్చింది.

ఏపీఈఆర్సి సభ్యులు , పీ రాజగోపాల్ రెడ్డి , ఠాకూర్ రామసింగ్ , ఏపీ డిస్కాముల సిఎండీలు, హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్ధన రెడ్డి , కే సంతోష రావు, ఆసియా లోనే ప్రముఖ పరిశోధన సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ( సిఈఈడబ్ల్యూ) తో జరిగిన సమావేశం లో ఏపీఈఆర్సి చైర్మన్ జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి మాట్లాడారు. ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ ను అధ్యయనం చేసి, దాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ విధానం విజయవంతమైనదని గుర్తుచేశారు . రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు ఇంధన సామర్ధ్య గృహోపకరణాలు వినియోగించేలా ప్రోత్సహించడానికి, వారు ఆర్థికంగా లబ్ది పొందడానికి ఈ విధానం దోహదపడుతుందన్నారు .

సమాజంలో ఏ వ్యక్తి గాని, భాగస్వామి గాని ఒక్క యూనిట్ విద్యుత్ ను ఉత్పత్తి చేయలేకపోవచ్చుగాని, తమ దయనందిన జీవితంలో ఎనర్జీ కన్సర్వేషన్ , ఎనర్జీ ఎఫిసిఎన్సీ ని భాగం చేసుకోవడం ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ను సులువుగా పొదుపు చేయగలరని ఆయన తెలిపారు.

ఈ ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ వల్ల వినియోగదారుల పై ఆర్థిక భారం పడదని ,విద్యుత్ బిల్లులలో వచ్చిన ఆదా ద్వారానే వాయిదా పద్ధతిలో వారు తిరిగి చెల్లింపులు చేయడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే డిస్కాముల మీద కూడా ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఈ ఫైనాన్సింగ్ మోడల్ ను రూపొందించడం జరుగుతుందన్నారు. స్వచ్చందంగా ముందుకు వచ్చిన వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తింపు చేస్తారు.

విద్యుత్ రంగంలో అనేక అంశాలతో పాటు ఇంధన పొదుపు , సామర్థ్యం పెంపుదలకు సంబంధించి అమలు కు ఏ పీ ఈ ఆర్ సి చేస్తున్న కృషిని సిఈఈడబ్ల్యు కి చెందిన సీనియర్ లీడ్ శాలు అగర్వాల్ అభినందనీయమన్నారు. ఇతర రెగ్యూలేటరీ కమిషన్లకు కూడా ఇది ఆదర్శప్రాయంగా ఉంటుందని తెలిపారు. దీని వల్ల వినియోగదారులు ప్రయోజనం పొందడం తో పాటు రాష్ట్ర , ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని, పర్యావరణ పరంగా ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

శాలు అగరవాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1. 5 కోట్ల వినియోగదారులతో దేశంలో అత్యుత్తమ సేవలు అందించే విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటిగా ఉందని తెలిపారు. విద్యుత్ రంగంలో వినియోగదారుల సరాసరి సంతృప్తి కి సంబందించి జాతీయ సగటు 77 శాతం ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లో ఇది 92 శాతంగా ఉండటం అభినందనీయం అన్నారు . అలాగే స్టేట్ ఎనర్జీ ఎఫిసీఎంసీ ఇండెక్స్ 2020 కి సంబంధించి జాతీయ స్థాయిలో మొదటి 6 రాష్ట్రాల్లో అఛీవర్ జాబితా లో ఉండడం అభినందనీయం అన్నారు.

సాధారణ ఫ్యాన్ల తో పోలిస్తే ఎనర్జీ ఎఫిసియెంట్ ఫ్యాన్ దాదాపు సగం విద్యుత్ మాత్రమే వినియోగించుకుంటుందని చెప్పారు. సూపర్ ఎఫిసియెంట్ ఫ్యాన్ ధర రూ 3000 నుంచి రూ 3500 లోపు వరకు ఉండగా సాధారణ సీలింగ్ ఫ్యాన్ ధర రూ 1500 లోపు ఉంటుందన్నారు . అయితే సూపర్ ఎఫిసియెంట్ ఫ్యాన్ 28 నుంచి 38 వాట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తుండగా సాధారణ సీలింగ్ ఫ్యాన్ 75 వాట్ల విద్యుత్ ను తీసుకుంటుందన్నారు . సూపర్ ఎఫిసియెంట్ ఫ్యాన్ 9 నెలల పాటు రోజుకు 7 గంటల చొప్పున వినియోగిస్తే ఏడాదికి 81 యూనిట్లు ఆదా చేస్తుందని అధికారులు తెలిపారు .

బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంటు (బీ ఎల్ డీ సి) టెక్నాలజీ తో పని చేసే సూపర్ ఎఫిసియెంట్ ఫ్యాన్లు వినియోగిస్తే, రాష్ట్రానికి రానున్న 10 ఏళ్లలో 7000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసే అవకాశO ఉందని అంచనా వేశారు . దీనివల్ల ప్రభుత్వానికి , డిస్కాములకు , వినియోగదారులకు కలిపి సుమారు రూ 4500 కోట్లు ఆదా అయ్యే అవకాశముందన్నారు .అలాగే 3.4 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం తగ్గే అవకాశముందన్నారు . సాధారణ బల్బుల స్థానములో ఎల్ ఈ డీ బల్బులు వినియోగించడం ద్వారా ఏడాదికి 73. 7 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా చేసిన థర్డ్ పార్టీ సర్వే లో వెల్లడైందన్నారు .

రాష్ట్రంలో నిర్వహించే డిమాండ్ సైడ్ మానేజిమెంట్ ప్రాజెక్టులో మేధోభాగస్వామిగా ఉండేందుకు సీ ఈ ఈ డబ్ల్యు ఆసక్తి చూపించింది. అలాగే ఇంధన సామర్ధ్య గృహోపకరణాలకు సంబందించి ఆర్థిక సంస్థలు , తయారీ దారులు , డిస్కాములతో జరిగే టెండర్ పక్రియ లో సహకరించేందుకు ఆసక్తి కనబరిచింది. వినియోగదారులకు నిర్వాహించే సర్వేలు , వర్కుషాపులు , గృహోపకారాల వినియోగం వల్ల ఏర్పడే ప్రభావాన్ని అంచనా వేయటం లో సహకరించేందుకు ఆసక్తి చూపింది.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *