ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యల పరిష్కార దిశగా స్పందన

-ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించిన,
-నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన స్పందన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజల నుండి వారి యొక్క సమస్యల అర్జిలను స్వీకరించారు. ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యల పరిష్కార దిశగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమము విశేష స్పందన వస్తుందని, ప్రతి సోమవారం ప్రజలు నేరుగా వచ్చి వారి యొక్క ఇబ్బందులను అధికారుల సమక్షంలో వివరించుట ద్వారా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వాటిని పరిష్కారించుట జరుగుతుందని అన్నారు. నేటి స్పందన కార్యక్రమములో రెవిన్యూ విభాగం – 2, పట్టణ ప్రణాళిక విభాగం – 3, పబ్లిక్ హెల్త్ విభాగం –3, యు.సి.డి విభాగం – 1, ఎడ్యుకేషన్ విభాగం – 1, మొత్తం 10 అర్జీలు స్వీక‌రించుట జరిగింది. తదుపరి విజయవాడ నగర కార్పోరేటర్లగా ఎన్నికై నేటికి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా అధికారులు మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారిచే కేకు కట్ చేయించి అభినందనలు తెలియజేసారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, చీఫ్ ఇంజనీర్ యమ.ప్రభాకర రావు, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 8 అర్జీలు 
సర్కిల్ – 1 కార్యాలయంలో 2 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం -1, సర్కిల్ – 2 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1 అర్జీ, మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో 5 అర్జీ ఇంజనీరింగ్ విభాగం – 3, పట్టణ ప్రణాళిక విభాగం -2 అర్జీలు ప్రజలు అందించుట జరిగిందని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *