-నీటి తీరువా చెల్లింపు లకు సరళీకృత విధానం
-ఆర్డీవో ఎస్. మల్లిబాబు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు నీటితీరువా చెల్లించే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకుని రావడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో వివరాలు తెలుపుతూ, గతంలో రైతుల నుంచి నీటి తీరువా పన్నులు వసూళ్ళ కోసం విఆర్వో లు, విఆర్ఏ లు ఇంటి వద్దకు వొస్తేనే కానీ పన్నులు రైతులు చెల్లించేవారు కాదన్నారు. నీటి తీరువా పన్నులు సకాలంలో చెల్లించక పోవడంతో ఎంజెయ్మెంట్ కు, గుర్తింపు కి ఇబ్బందులు పడుతున్నారని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సరళీకృత విధానం అమలుకు చర్యలు చేపట్టారని ఆర్డీవో తెలిపారు. కరెంట్, టెలిఫోన్ బిల్లులు ఏ విధంగా చెల్లించుతారో, ఆ తరహా లో కిస్తీ చెల్లించవలసిన సమయానికి గ్రామ వాలంటీర్ మీ ఇంటికి నీటితీరువా డిమాండ్ నోటీస్ అందచేయ్యడం జరుగు తుందన్నారు. “ఇ- గేట్ వే ” ద్వారా మీరు ఎంత నీటి తీరువా చెల్లించలో ఆ డిమాండ్ నోటీసు ద్వారా తెలియచేస్తారని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. నీటితీరువా పన్ను మొతాన్ని రైతులు ఇంటి నుంచే ఆన్లైన్ లోగాని, సచివాలయంలో గానీ చెల్లించాలని కోరారు. తద్వారా మీ భూములపై హక్కుని, స్వాధినతనీ నిరూపించుకుని, సర్వహక్కులు పొందగలరని మల్లిబాబు పేర్కొన్నారు.