కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు స్పందన లో ఏడు(7) ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదు లను స్వీకరించడం జరిగింది. ఆర్డీవో మల్లిబాబు వివరాలు తెలుపుతూ, జలకళ, భూమి సమస్యలు, వికలాంగ పెన్షన్, ఉపాది తదితర అంశాలపై స్పందనలో దరఖాస్తు లు సమర్పించారన్నారు. వయో భారం తో వొచ్చే సమస్యలకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ రాదని, వైద్య పరమైన సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు ను సిఫార్సు చెయ్యగలమని పేర్కొన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో డిడిఓ/ఎంపీడీఓ జగదాంబ, హౌసింగ్ ఈఈ సిహెచ్. బాబూరావు, ఏవో జవహర్ బాజీ, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, డివిజన్ కి సంబంధించిన శాఖల అధికారులు పాల్గొన్నారు.
