-జేసి డా.కె.మాధవీలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు భరోసా కేంద్రాల ద్వారా శనగ పంటను కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ ఆధ్వర్యంలో ఏపి మార్క్‌ఫెడ్, ఏయంసి, డిసియంఎస్, పిఏసిఎస్‌ల ద్వారా రైతుభరోసా కేంద్రం పరిధిలో ఉన్న శనగ పంటను క్వింటాల్ రూ. 5,230ల కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనగ పంట కొనుగోలు మద్దతు ధర 5,230 రూపాయాలుగా నిర్ణయించిందన్నారు. ఈ` పంటలో నమోదు చేసుకున్న రైతుల ద్వారానే శనగ పంటను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ముందుగా తమ గ్రామ వ్యవసాయ సహయకుని సంప్రదించాలన్నారు. పంట విస్తీర్ణమును అనుసరించి రైతు భరోసా కేంద్రంలో సియం య్యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ముందుగా చిన్న సన్న కారు రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తామన్నారు. ఆ తరువాత పెద్ద రైతుల నుంచి కూడా పంట కొనుగోలు చేస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని, తేమ శాతం ఎక్కువగా ఉన్న శనగ కొనుగోలు చేయమన్నారు. కనీస తేమ శాతం 14 శాతం ఉండాలని, పాక్షికంగా దెబ్బతిన్న, రంగుమారిన గింజలు 4 శాతం ఉండాలన్నారు. అలాగే ముతక గింజలు 6 శాతం ఉండాలని, పురుగు పట్టిన గంజలు 4 శాతం, ఇతర పంట గింజలు కేవలం 3 శాతం ఉండాలని జేసి నాణ్యత ప్రమాణాలు వివరించారు. రైతులు తాము పండిరచిన శనగ పంటను విక్రయించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ఫోన్ నెంబరుకు 0866`2471015 / 8978381836, 9652095861 సంప్రదించాలని కోరారు.