దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే కోవిడ్‌-19 మహమ్మారితో ఎదురైన అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో గొప్ప మైలు రాయిని అధిగమించింది. జోన్‌ 2021-22 సంవత్సరంలో (2021 ఏప్రిల్‌ నుండి 2022 మార్చి 17వ తేదీ వరకు) సరుకు రవాణాలో 112.51 మిలియన్‌ టన్నుల (ఎమ్‌టీల) లోడిరగ్‌ నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరుకుల లోడిరగ్‌ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాలలో సరుకు రవాణాలో వృద్ధి సాధించింది. దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది మరియు అధికారులు అహర్నిశలు కృషి చేస్తూ సరుకు రవాణా రైళ్ల రాకపోలను నిరంతరం పర్యవేక్షిస్తూండడంతో సరుకు రవాణాలో గత ఆర్థిక సంవత్సరం 2020`2021తో పోలిస్తే 17.7% అధిక ఆదాయాన్ని మరియు 17.3% అధిక లోడిరగ్‌ను సాధించింది. సరుకు రవాణా లోడిరగ్‌ పురోగతిలో బొగ్గు 53.78 ఎమ్‌టీల లోడిరగ్‌తో, సిమెంట్‌ 32.339 ఎమ్‌టీల లోడిరగ్‌తో, ఆహార ధాన్యాలు 7.980 ఎమ్‌టీల లోడిరగ్‌తో, ఎరువులు 5.925 ఎమ్‌టీల లోడిరగ్‌తో, కంటైనర్ల సేవలు 2.137 ఎమ్‌టీల లోడిరగ్‌తో, స్టీల్‌ ప్లాంట్ల కోసం ముడి సరుకు 4.14 ఎమ్‌టీల లోడిరగ్‌తో మరియు అల్మూనియా పౌడర్‌, ఫ్లైయాష్‌, గ్రానైట్‌, చెక్కర మొదలైనవి 5.80 ఎమ్‌టీల లోడిరగ్‌తో భాగస్వామ్యంగా ఉన్నాయి. సరుకు రవాణాలో వివిధ వినూత్న పథకాలు చేపట్టడం మరియు పలు స్టేషన్ల మార్గాలలో మౌలిక సదుపాయాల కల్పనతో సహా సరుకు రవాణా నిర్వహణకు అనేక సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి చర్యలు తీసుకోవడంతో సరుకు రవాణా ఆదాయం మరియు లోడిరగ్‌ వృద్ధి సాధించడానికి తోడ్పడినాయి. దీనికి అదనంగా, డివిజినల్‌ మరియు జోనల్‌ స్థాయిలలో నూతనంగా ఏర్పాటు చేసిన బిజినెస్‌ డెవప్‌మెంట్‌ యూనిట్లు (బిడియూ) జోనల్‌ సరుకు రవాణాలో అభివృద్ధికి దోహదపడిరది.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిశోర్‌ సరుకు రవాణా రంగంలో మెరుగైన రికార్డులను నమోదు చేయడం మరియు మైలురాయి అయిన రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంలో అంకిత భావంతో కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే బృందాన్ని అభినందించారు. జోన్‌ సరుకు రవాణ లోడిరగ్‌లో మరియు ఆదాయంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇదే కృషి ఇకమీదట కూడా కొనసాగించాలని ఆయన సూచించారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *