Breaking News

బాబా సాహెబ్ జీవితం తరతరాలకు ఆదర్శం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్
-ఎమ్మెల్యే చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ పున: ప్రతిష్ఠ మరియు లైబ్రరీ ఏర్పాటుకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్‌.అంబేద్కర్ అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ నందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ పున: ప్రతిష్ఠ మరియు దళిత సామాజిక గ్రంథాలయ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం అంబేద్కర్ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎండి రుహుల్లా, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రపంచ మేధావి అని ఈ సందర్భంగా కీర్తించారు. అజిత్ సింగ్ నగర్ లోకి అడుగుపెట్టే ప్రజలకు ముందుగా ఆ మహనీయుని విగ్రహమే దర్శనమిస్తుందన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతుందంటే అందుకు ముఖ్య కారణం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగమే ముఖ్య కారణమన్నారు. ఆయన రాసిన రాజ్యాంగంలోని ప్రతి పదం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. అణగారిన బహుజనుల సంక్షేమం కోసం, సమసమాజాన్ని నిర్మించడానికై బి.ఆర్.అంబేద్కర్ జీవితకాలం కష్టపడ్డారని మల్లాది విష్ణు అన్నారు. రాబోయే వందేళ్లు సమాజంలోని మార్పులను ముందే అంచనా వేసి, పరిష్కారాలను ఆనాడే రాజ్యాంగంలో సూచించిన వ్యక్తి అంబేద్కర్‌ అని కీర్తించారు. సామాజిక న్యాయం, స్వాతంత్య్రం, అంటరానితనం, రిజర్వేషన్లపై తనదైన శైలిలో రాజ్యాంగంలో వివరణలు ఇచ్చారని చెప్పారు. ఆయన మూలంగానే ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగ దేశంగా భారతదేశం అవతరించిందన్నారు. అంబేద్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని తెలిపారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు, ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్లడమే.. ఆ మహనీయునికి అర్పించే నిజమైన నివాళి అని మల్లాది విష్ణు అన్నారు. బాబా సాహెబ్ స్ఫూర్తితో సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రుహుల్లా మాట్లాడుతూ.. వివక్షను సమాజం నుంచి తరిమికొట్టేందుకు, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. బాబా సాహెబ్ స్ఫూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడిన మహనీయ వ్యక్తి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకుని భావితరాల వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, హఫీజుల్లా, అలంపూర్ విజయ్, అఫ్రోజ్, అంబేద్కర్ అభ్యుదయ సేవా సమితి నాయకులు మద్దాల చక్రవర్తి, కె.కోటేశ్వరరావు, రెబ్బా అంబేద్కర్, js మనోరంజన్, చింతగుంట సౌరి, బేటి జోజి, అరవింద్, మన్నం అశోక్, తురక చిన్ని పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *