దేవుని సేవకుని వా ? రాజకీయనాయకుడు వా ?…. : మేదర సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దైవ సందేశాన్ని అందించే నువ్వు ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తవు అనిల్ బ్రదర్ అంటు ఎపి క్రిష్టియన్ జాయింట్ యాక్షన్ కమిటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. గురువారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఎపి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లోని క్రిస్టియన్లు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఇన్ని రోజులు నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాను నేను ఎప్పటికీ రాజకీయ పార్టీని పెట్టను అన్నటువంటి నువ్వు విశాఖపట్టణం లో మాట్లాడిన మాటలు ఏమిటన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే మీ జాగీర్ అనుకుంటున్నావా ? లేక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ లోకం మొత్తం నీ వెంటే నడుస్తుంది అని అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. ఎవరైన పార్టీ పెట్టి హక్కు ఉంటుంది కానీ దేవుని ముసుగులో పెట్టడం అన్యాయం అక్రమం కావాలంటే దేవుని సేవ ని ప్రక్కనబెట్టి రాజకీయ నాయకు ని అవతారం ఎత్త వచ్చునని సూచించారు. దేవుని సేవకులు గా ఉండి దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుగా లేదా అని అన్నారు. మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పావు నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఎప్పుడు రాను అన్నావు మరి ఇప్పుడు క్రైస్తవుల్ని ఉద్దేశించి క్రైస్తవుల కి ఏదో అన్యాయం జరిగిపోతున్నది. అవి నేను ఇస్తాను. నేను తెస్తాను అని అనడం హాస్యాస్పదమని వాఖ్యానించారు. ఒకరు తెలంగాణలో పార్టీ ఇట్టి నవ్వులపాలు అయితే మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి నవ్వులపాలు కావాల్సిన అవసరం ఉన్నదాన్నారు.గతంలో అనేకమంది దైవ సేవకులకు ఆర్థిక సహాయం, చర్చీలు కట్టించడానికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. చర్చి పాస్టర్ ల కి జీతాలు అందిస్తామని పది సంవత్సరాలు అయిందని విమర్శించారు. మీకేమన్నా క్రైస్తవుల పట్ల ప్రేమ ఉన్నట్లయితే క్రైస్తవుల కి సహాయం చేయవచ్చునని ఇన్ని రోజులు ఊరకనే ఉండి ఇప్పుడు క్రైస్తవుల్ని ఉద్దరిస్తారు అనడం ఎంతవరకు సబబు అని అన్నారు. అగ్రకులానికిక చెందినటువంటి మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీవర్గాలను ఉద్దరిస్తానని అనడంలో ఆంతర్యం ఏమిటి. ఎన్నికలప్పుడే క్రైస్తవులు మీకు గుర్తు వస్తారా? తిరిగి ఎన్నికలు వచ్చేంత వరకూ మీరు ఎక్కడ ఉంటారు ? ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి మీ పని మీరు చేసుకుంటే మంచిది అనిల్ బ్రదర్. మీ ఆలోచనలు తప్పు నీ దారి తప్పు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవరండ్ ఎలిషా, రెవరండ్ దయానంద్, పాస్టర్ డానియేల్, పాస్టర్ అబ్రహం, బ్రదర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *