తెలుగుటైమ్స్‌ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికాలో గత 19 సంవత్సరాలుగా తెలుగు కమ్యూనిటీకి మీడియాపరంగా సేవలందిస్తున్న ‘తెలుగుటైమ్స్‌’ పత్రిక మొబైల్‌ యాప్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలోని ఎన్నారైలకు మీడియా వాహనంగా, ఎన్నారైలు మరియు తెలుగు రాష్ట్రాల మధ్య మీడియా వారధిగా సేవలందిస్తున్న తెలుగు టైమ్స్‌ 19వ వార్షిక శుభవేళలో తన మొబైల్‌ యాప్‌ను తీసుకువచ్చినందుకు శుభాభినందనలు అన్నారు. ‘ఈ రోజుల్లో అందరూ మొబైల్‌ ఫోన్‌లలో మాత్రమే వార్తలు మరియు వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. చదువుతున్నారు. అందుకే చాలా కంపెనీలు ముఖ్యంగా మీడియా పరిశ్రమలోని వారు తమ స్వంత మొబైల్‌ యాప్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇదొక సాంకేతిక విప్లవం అంటూ ‘‘తెలుగు టైమ్స్‌ మొబైల్‌ యాప్‌ని అభివృద్ధి చేసినందుకు చాలా సంతోషం. దీనివల్ల వార్తలు మరింత మందికి వేగంగా చేరువవుతుందన్నారు. మొబైల్‌ యాప్‌ని ఇప్పుడు ప్రారంభించడం ద్వారా తెలుగుటైమ్స్‌ వార్షికోత్సవ వేడుకల్లో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు టైమ్స్‌కు అన్ని విజయాలు మరియు వృద్ధి జరగాలని కోరుకుంటున్నాను అని కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
తెలుగుటైమ్స్‌ ఎడిటర్‌ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ ఆన్‌లైన్‌ వ్యూయర్‌షిప్‌లో దాదాపు 75% ఫోన్‌ ద్వారానే జరుగుతోందని, తెలుగు టైమ్స్‌ కూడా తెలుగు టైమ్స్‌ 19వ వార్షికోత్సవం సందర్భంగా మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చిందని అన్నారు. యాప్‌ను అంగీకరించి విడుదల చేసినందుకు ఏపీ ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆండ్రాయిడ్‌ మరియు ఐఓఎస్‌ వెర్షన్‌ల కోసం యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సుబ్బారావు కోరారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *