Breaking News

విధులలో అలసత్వం ప్రదర్శిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-తాగునీటి ఫిర్యాదులపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్షేత్రస్థాయి పరిశీలన
-స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తాగునీటి సమస్యలపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. 62, 64 డివిజన్ లలో శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సిబ్బంది కాలనీలలో పర్యటిస్తున్నది లేనిది స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బర్మాకాలనీలోని సి5 బ్లాక్ నందు తాగునీటి సమస్య 4 రోజులుగా నెలకొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల అలసత్వం పనికి రాదన్నారు. ఒక‌వైపు ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత‌నిస్తూ మంచినీటి స‌దుపాయాలు పెంచుతుంటే.. మ‌రోవైపు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండ‌టమేంట‌ని ప్రశ్నించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కనీసం గంట సేపు అయినా నిరంతరాయంగా నీరు అందేలా చూడాలన్నారు. కొన్ని చోట్ల పగిలిన తాగునీటి ప్లాస్టిక్ పైపులైన్లను తక్షణమే మార్చవలసిందిగా సూచించారు. 15 వ ఆర్థిక సంఘం, అమృత్ 2 కలిపి దాదాపు రూ. 100 కోట్ల నిధులు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం నిధులు మంజూరయ్యాయని మల్లాది విష్ణు తెలిపారు. ఇటువంటి తరుణంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వీటితో పాటు అపార్ట్ మెంట్ల మధ్య పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కె.కె.అపార్ట్ మెంట్ వద్ద మంచినీటి పైపు లైన్లు ఉన్న ప్రదేశంలో మురికి నీరు నిల్వ ఉండటంపై మండిపడ్డారు. పారిశుద్ధ్య పరిస్థితులను తక్షణమే చక్కదిద్దాలని ఆదేశించారు. పనిచేసే అధికారులు, సిబ్బంది మాత్రమే విధులలో కొనసాగుతారని.. క్షేత్రస్థాయిలో పర్యటించని వారు ఎవరైనా వేటు తప్పదని హెచ్చరించారు. ఇకనైనా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం బర్మా కాలనీ పార్కును పరిశీలించారు. ప్రాంతంలో ఎండిన మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలను నాటాలని సిబ్బందికి సూచించారు. అలాగే నాటిన మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి, ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, నాయకులు అలంపూర్ విజయ్, యర్రగొర్ల శ్రీరాములు, వీరబాబు, రామిరెడ్డి, మస్తాన్, బోరా బుజ్జి, హైమావతి, గ్రేసీ, అనిల్, తాండవ కోటి, బురాల ఏసు, కృప, పరిమి నాగేశ్వరరావు, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *