నగరంలో మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించుటకు చర్యలు…

-4వ డివిజన్లో రూ. 20 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించిన మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని, నగర మేయర్ మోక వెంకటేశ్వరమ్మ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం స్థానిక 4వ డివిజన్ సర్కార్ తోట ఎస్టేట్ రోడ్ లో వినాయకుడి గుడి వద్ద నుండి ఉల్లిపాలెం రోడ్డు వరకు 20 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు పనులు మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ కై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు 4వ డివిజన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి వలంద పాలెం సర్వీస్ రిజర్వాయర్ నుండి 20 లక్షలతో వినాయకుడి గుడి వద్ద నుండి ఉల్లిపాలెం రోడ్డు వరకు కు ఆరంగుళాల పైపులైను మరియు ఈ రోడ్డు కి కనెక్ట్ అయ్యే సందులలో 4 అంగుళాల పైపులైను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలు వివరిస్తూ కొందరు మహిళలు తమకు ఇళ్ల స్థలం రాలేదని, మరో మహిళ చేయూత పథకం రాలేదని ఈ విధంగా పలువురు మహిళలు మంత్రిని కలిసి తమ సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు.
సంబంధిత మునిసిపల్ అధికారులు సచివాలయ సిబ్బందిని పిలిచి కారణాలు తెలుసుకొని స్థలాలు పథకాలు మంజూరు అయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, స్థానిక కార్పొరేటర్ పినిశెట్టి నాగ ఛాయాదేవి, వార్డ్ ఇంచార్జ్ వడ్డీ రాఘవ, పలువురు కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్ దాదా, మున్సిపల్ ఇంజనీర్ త్రినాధరావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *