నిరంతరం పార్టీ కోసం పార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది…

-ఏపీ లీగల్ సెల్ చైర్మన్ వి గురునాధం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలకు నిర్విరామముగా పాల్గొంటూ తన వంతు సేవలను కృషిని అందించిన విద్యార్ధి నాయకుడు షేక్.ఇస్మాయిల్ గత కొన్ని రోజులుగా రక్త హీనత అనారోగ్య సమస్యతో బాధపడుతూ సత్యనారాయణపురంలోని స్వర మల్టీస్పెషల్ హాస్పిటల్ నందు చికిత్స కొరకు అడ్మిట్ అయిన సందర్భములో విద్యార్ధి నాయకుడు షేక్.ఇస్మాయిల్ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ఆరోగ్య పరిస్థిని తెలుసుకొని తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5000/- ఆర్ధిక సాయం చేయడం జరిగింది.

వి.గురునాధం గారు మాట్లాడుతూ నిరంతరం పార్టీ కోసం పార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనీ, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో రాష్ట్ర మరియు దేశ రాజకీయాలలో కుల మత ప్రాంత వర్గ భేదాలు లేకుండా ఉన్నత స్థానం కల్పిస్తుందని అన్నారు.

ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి నాయకుడు షేక్.ఇస్మాయిల్ పడుతున్న ఆనారోగ్య సమస్యను చెప్పగానే గొప్ప మానవతాహృదయంతో ముందుకు వచ్చి తమవంతు ఆర్థిక సాయం అందించిన ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ శ్రీ వలిబోయిన గురునాధం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి దాని విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. నందు పని చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తను ఏదో ఒక విధంగా ఆదుకుంటామని కాంగ్రస్ పార్టీ తరుపున మరియు ఆంధ్రప్రదేశ్ ఎన్.ఎస్.యు.ఐ. తరుపున తెలియజేయడమైనది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల రామకృష్ణ, ఎన్.ఎస్.యు.ఐ. నగర నాయకులు బత్తుల అంకమ్మరాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *