Breaking News

ప్రతిఒక్క విద్యార్థి ఆంగ్ల విద్యలో నైపుణ్యం సాధించాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-విద్యకు జగనన్న ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
-ఎమ్మెల్యే చేతులమీదుగా పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మి ముందుకు సాగుతున్న ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ముత్యాలంపాడులోని గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక గ్రంథాలయం సంఘ సభ్యుల సేవలను కొనియాడారు. చదువుకు అదనంగా సమయం కేటాయించే విద్యార్థులు ఖాళీ కడుపులతో ఉండకూడదనే ఉద్దేశంతో వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీంతో పాటుగా మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తుండటం హర్షణీయమన్నారు.

ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు పదవ తరగతి తొలిమెట్టు అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కనుక ప్రతిఒక్కరూ శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుందన్నారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని, పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో.. జగనన్న ప్రభుత్వం అనేక పథకాలను విద్యార్థులకు చేరువ చేయడం జరిగిందన్నారు. ఇంగ్లిష్‌ మీడియాన్ని అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా.. ‘అమ్మ ఒడి’ పేరిట చదువుకునే పిల్లలున్న తల్లులకూ ఆర్థిక ఆసరా కల్పించారన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 38,427 మంది విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని అందించామన్నారు. 14,188 వేల మంది విద్యార్థులకు పాఠశాలలు మొదలైన రోజే పుస్తకాలు, యూనిఫారాలతో సహా మొత్తం 7 రకాల వస్తువులతో కూడిన కిట్లను ‘జగనన్న విద్యాకానుక’గా అందజేయడం జరిగిందన్నారు. ఇవేగాక జగనన్న గోరుముద్ధ, వసతి దీవెన వంటి పథకాలను దిగ్విజయంగా అమలుచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కేవలం 37 లక్షలు కాగా.. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా వారి సంఖ్య గణనీయంగా పెరిగి 43 లక్షలకు పైగా చేరిందన్నారు. ఫలితంగా ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు రూపాంతరం చెందాయని వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక గ్రంథాలయ సేవా సంఘం సభ్యులు కాకర్లపూడి సుబ్బరాజు, పెనుమత్స సుబ్బరాజు, సామంతకూరి సుబ్బరాజు, సామంతకూరి గోవిందరాజు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, నాయకులు పెనుమత్స సత్యం, మానం వెంకటేశ్వరరావు, మురళికృష్ణం రాజు, పట్టాభిరామ రాజు, బెజ్జం రవి, అంగిరేకుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *