తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
వవిద్యుత్ విని యోగదారులు తెల్లకాగితంపై QR కోడ్ తో వచ్చే బిల్లులకు డిజిటల్ చెల్లింపులకు అలవర్చు కోవాలని విద్యుత్ EE J. హరిబాబు తెలిపారు. శనివారం చెంచు పేట విద్యుత్ కేంద్రంలో వినియోగదారుల సమస్యలు-పరిష్కారాలు సంబంథించిన సమావేశంలో ఆయన పలు వినియేగదారుల సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. సమావేశంలో కటెవరం ఎరుకలపూడి లైను స్థంభాలు ఒరిగిన దానిపై మొక్కజొన్న పంట మాసూలైన పిదప, కోపల్లెకు Helper రజక చెరువు వద్ద ట్రన్స్ ఫాం, వ్యవసాయ కనెక్షన్ ఇవ్వనున్నామని తెలిపారు. అథికారికంగా కోతలు లేవన తెలిపారు. ఈ సమావేశంలో DEE లు అశోక్ కృష్టారావు తేజోపంత్ AAO లీలావతి AEలు సీనియర్ సిటిజన్స్ తరుఫున బొమ్మదేవర వేంకటేశ్వరావు, సోమయ్యశాస్త్రి, వినియేగదారులు పాల్గొన్నారు.
