విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం నందు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, Ex.MLA బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గ 33వ డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా టీడీపీ యువనాయకులు బోండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బోండా రవితేజ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించిన నాయకుడు బోండా ఉమా అని స్పష్టం చేసారు. బ్రాహ్మణ సామాజికవర్గం ఎక్కువ ఉన్న ఈ 33వ డివిజన్ లో బ్రాహ్మణులకు 100% సంక్షేమాన్ని అందించడం జరిగింది అన్నారు. స్థానికంగా అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఎవరైనా చనిపోతే వారికీ ఉపయోగపడేందుకు రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా అంతిమయాత్ర భవనాన్ని నిర్మించైనా ఘనత బోండా ఉమా ది అని గుర్తు చేసారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం బోండా ఉమా చేసిందే తప్ప మరే శాసన సభ్యుడు చెయ్యలేదని అన్నారు. 2014 లో అప్పటి ముఖ్య మంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ నెలకొలపడం జరిగింది, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు పెన్షన్, విద్యార్థులకు స్కాలర్ షిప్లు, మరణించిన పేద బ్రహ్మణ కుటుంబానికి గరుడా స్కీమ్ ద్వారా 10,000/- చొప్పు ఆర్థికసహయం, విదేశీ విద్యకు శ 1,00,000/-, ఆర్థిక సహయం అందిస్తూ కార్పొరేషన్ ద్వారా ఎంతో మందికి ఉపకారం జరిగింది అన్నారు. ఇప్పుడు మీ వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి పేద బ్రాహ్మణులకు అన్యాయం చేస్తుంది అన్నారు. స్థానిక mla మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మెన్ గా ఉండి ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఆర్ధిక సహాయం చేసిన దాఖలాలు లేవు అని, నియోజకవర్గంలో mla గెలిచి ప్రజాసేవ తప్ప శంకుస్థాపనలకు పరిమితం అయ్యారు అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బ్రాహ్మణులకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేయాలని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్ ఇంచార్జి గార్లపాటి విజయ్ కుమార్, అధ్యక్షులు నాలం కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చామర్తి రవిబాబు, నేతలు ఘంటా కృష్ణ మోహన్, బత్తుల రామకృష్ణ, కోలా దుర్గారావు, బెజ్జం జైపాల్, సంకర మనోజ్, చిలువేరు శ్రీను, కాశీనాధమ్ సుధాకర్, శ్రీనివాస మూర్తి, సాయి, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …