కీ-హోల్ సర్జరీల్లో సెంచరీ నమోదు


-అరుదైన ఘనతతో రికార్డులకెక్కిన డాక్టర్ వరుణ్
-లిమ్కా బుక్, ఇండియా బుక్ రికార్డుల నమోదు కోసం అపూర్వ సమ్మేళనం
-కీ-హోల్ సర్జరీలతో స్వాంతన పొందిన వంద మందితో భేటీ
-కీ-హోల్ సర్జరీలు చేయించుకున్న అత్యధిక మంది పాల్గొన్న మొట్టమొదటి సమావేశంగా నిపుణుల ధ్రువీకరణ
-కీ-హోల్ సర్జరీతో గాటు తక్కువ.. ఫలితం ఎక్కువ..
-మెట్రో నగరాలతో పోల్చితే అతి తక్కువ వ్యయంతో కీ-హోల్ సర్జరీలు
-డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఛైర్మన్, ప్రముఖ కీ-హోల్ సర్జన్ డాక్టర్ గుంటూరు వరుణ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక వైద్య రంగంలో అనితర సాధ్యమైన రికార్డు నమోదయింది. శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక ప్రక్రియగా పేర్కొనదగిన కీ-హోల్ సర్జరీల్లో డాక్టర్ గుంటూరు వరుణ్ సెంచరీ నమోదు చేశారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం అతి చిన్న గాటుతో పూర్తిచేయగలిగే అద్భుతమైన కీ-హోల్ సర్జరీలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న డాక్టర్ వరుణ్.. తానొక్కరే వందకు పైగా కీ-హోల్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించి రికార్డు నెలకొల్పారు. అత్యంత ప్రభావవంతమైన కీ-హోల్ సర్జరీ ప్రక్రియ గురించి మరింత విస్తృతంగా ప్రజలకు వివరించేందుకు డాక్టర్ వరుణ్ ఓ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తన వద్ద కీ-హోల్ సర్జరీ చేయించుకుని స్వాంతన పొందిన వంద మందితో అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. నగరంలోని తాజ్ వివంత హోటల్లో ఆదివారం జరిగిన ఈ భేటీ.. డాక్టర్ వరుణ్ విజయగాధను ప్రపంచానికి చాటిచెప్పింది. తాను కీ-హోల్ సర్జరీలు చేసిన వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన డాక్టర్ వరుణ్.. తాను సాధించిన ఘనత చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండేలా చేశారు. తన చేత కీ-హోల్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులను కళ్లెదుట నిలిపి రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకున్నారు. కీ-హోల్ సర్జరీల్లో డాక్టర్ వరుణ్ సాధించిన కీ-హోల్ సర్జరీల్లో సెంచరీ ఘనతను నేరుగా పరిశీలించిన గుంటూరు డీఐజీ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఇందుమతిలు కీ-హోల్ సర్జరీలు చేయించుకున్న అత్యధిక మంది పాల్గొన్న మొట్టమొదటి సమావేశంగా ధ్రువీకరించారు. సదరు వివరాలను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పరిశీలించిన అనంతరం ఆయా రికార్డుల్లో పొందుపరుస్తారు.

డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఛైర్మన్, ప్రఖ్యాత కీ-హోల్ సర్జన్ డాక్టర్ గుంటూరు వరుణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాధారణ శస్త్రచికిత్సలతో పోల్చితే, కీ-హోల్ సర్జరీగా పిలువబడే మినిమల్ యాక్సెస్ సర్జరీలు అత్యంత ప్రభావవంతమైనవని, సర్జరీ అనంతరం పేషేంట్ త్వరగా కోలుకోగలుగుతారని అన్నారు. సాధారణ పద్దతిలో నిర్వహించే కార్డియాక్ సర్జరీలు, చెస్ట్ ఆపరేషన్లలో దాదాపు 25 సెంటీమీటర్ల మేర కోత పెట్టాల్సివుంటుందని, ఛాతీ భాగంలో ఎముకను కత్తిరించాల్సి వస్తుందని అన్నారు. కీ-హోల్ విధానంలో కేవలం రెండు అంగుళాల స్వల్ప గాటుతో, ఎముకలకు ఏమాత్రం నష్టం కలుగకుండా శస్త్రచికిత్స పూర్తవుతుందని తెలిపారు. మామూలు శస్త్రచికిత్సలు చేయించుకున్న వారితో పోల్చితే, కీ-హోల్ సర్జరీలు చేయించుకున్న వారికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం తక్కువని వివరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కీ-హోల్ సర్జరీతో గాటు తక్కువ.. ఫలితం ఎక్కువ.. అని డాక్టర్ వరుణ్ పేర్కొన్నారు. మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే కీ-హోల్ సర్జరీ సేవలను, అక్కడితో పోల్చితే అతి తక్కువ వ్యయంతో ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. కీ-హోల్ సర్జరీ ద్వారా మొట్టమొదటి బృహద్ధమని కవాట మార్పిడి చికిత్స చేసిన ప్రపంచ ప్రఖ్యాత శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జోసఫ్ సవిక్ మార్గనిర్దేశంలో, అమెరికాలోని ఒహాయో నగరంలోని క్లీవ్ లాండ్ క్లినిక్ హాస్పిటల్ నందు కీ-హోల్ సర్జరీ నిర్వహణలో తాను ప్రతిభ గడించినట్లు తెలిపారు. డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ నందు వందకు పైగా కీ-హోల్ సర్జరీలను విజయవంతంగా పూర్తిచేశామని, వీటిలో అత్యంత సంక్లిష్టమైన కేసులు కూడా ఉన్నాయని అన్నారు. అధిక బరువు కలిగిన వారికి, వయోవృద్ధులకు సైతం కీ-హోల్ సర్జరీలను నిర్వహించామని, పుట్టుకతో గుండెలో రంధ్రం ఉన్న పేషేంట్లకు శస్త్రచికిత్స, వాల్వ్ రిపేర్, వాల్వ్ రీప్లేస్మెంట్, బైపాస్ సర్జరీలు (టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్) తదితర క్లిష్టమైన చికిత్సలను కీ-హోల్ పద్దతిలో విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించారు. కీ-హోల్ సర్జరీ అనేది అత్యంత నైపుణ్యంతో కూడుకున్నదని, తాను కీ-హోల్ సర్జరీ చేసిన వ్యక్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి రికార్డులను నెలకొల్పడం ద్వారా కీ-హోల్ సర్జరీ ప్రక్రియకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని, తద్వారా మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక కీ-హోల్ గుండె ఆపరేషన్లను రాష్ట్ర ప్రజలకు, నగరవాసులకు ఆర్థికంగా అందుబాటులోకి తెచ్చామని డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఛైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్ తెలిపారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *