Breaking News

19 వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో 117 మందికి ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య నాని, నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్లు అధికారులతో కలిసి స్థానిక వైయస్సార్ కాలనీలో 19 వ డివిజన్ (రైల్వే స్టేషన్ సమీపంలో) ఆదివారం 117 మంది లబ్ధిదారులకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు తమకు ఇళ్ల స్థలాలు మంజూరు రాలేదని మంత్రికి తెలుపగా, వీరి పేర్లు నమోదు చేసుకుని, వారి అర్హతలు పరిశీలించాలని వాలంటీర్లకు మంత్రి సూచించారు. అర్హతకలగి సైట్ ఓపెన్ కాక పెండింగ్ ఉన్న వారిని వెంటనే సైట్ లో నమోదు చేయాలని స్థలాలు మంజూరు చేయాలని మంత్రి సచివాలయ, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తూ నిరుపేదల అందరికీ సొంత ఇల్లు కల నెరవేర్చేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. ఇళ్ల స్థలాలు రానివారు ఆందోళన చెందవద్దన్నారు. కరఅగ్రహారం లేఅవుట్ అభివృద్ధి చేసి బౌండరీలు వేసి, వచ్చే సోమ మంగళవారాల్లో లేఅవుట్ లో డివిజన్ల వారీగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు భూమిపై చూపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చభా, ముడా చైర్పర్సన్ నాగలక్ష్మీ దుర్గ భవాని, డిప్యూటీ మేయర్ కవిత, బందర్ ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే కాజావాలి, కమిషనర్ సబ్బీ శివరామకృష్ణ, తాసిల్దార్ డి సునీల్ బాబు, వార్డు ఇన్చార్జి రామారావు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *