వంట నూనెల బ్లాక్ మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి…

-ఎం.ఆర్.పి. కంటే అధిక ధరలకు విక్రయించిన దుకాణాలపై 889 కేసులు నమోదు..
-విజిలెన్సు దాడులతో ధరలు అదుపులోకి..
-అనధికార నిల్వలు, కృత్రిమ కొరత సృష్టిస్తే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తాం..
-ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినా, అవకతవకలు జరిగినా విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు చెందిన సమాచారాన్ని 94409 06254 నెంబరుకు వాట్స్ ఆఫ్, ఎస్.ఎం.ఎస్. ద్వారా సమాచారం అందించండి..
-కృష్ణా జిల్లాలో పాత స్టాక్ అమ్మకుండా నిల్వ ఉంచిన 5.67 మెట్రిక్ టన్నులు ప్రియా గోల్డ్ పామాయిల్ వంట నూనెలు స్వాధీనం చేసుకున్నాం..
-విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డా. షoకబ్రత బాగ్చి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహిరంగ మార్కెట్ లో వంట నూనెల ధరలను నిర్దేశిత ఎమ్.ఆర్.పి. కంటే అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించినా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, ఎక్స్ ఆఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ డా. షoకబ్రత బాగ్చి అన్నారు.
నగరంలోని స్థానిక ఎన్.టి.ఆర్. పరిపాలనా భవనం 3వ అంతస్తు కాన్ఫెరెన్స్ హాల్ లో ఆదివారం వంట నూనెల ధరల అదుపునకు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, ఎక్స్ ఆఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ డా. షoకబ్రత బాగ్చి, ఆశాఖ డిప్యూటీ డైరెక్టర్ జెనెరల్ అఫ్ పోలీస్ డా. షిముషి బాజ్ పై లతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా డా. షoకబ్రత బాగ్చిమాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని సాకుగా చూపి బహిరంగ మార్కెట్ లో వంట నూనెల ధరలను పెంచి అమ్ముతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాలు, తూనికలు-కొలతలు, ఫుడ్ అండ్ సేఫ్టీ, విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మికంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1890 హోల్ సేల్ అండ్ రిటైల్ వ్యాపార కేంద్రాలపై విస్తృత దాడులు, తనిఖీలు నిర్వహించి పరిమితికి మించి నిల్వలు గుర్తించినందున 6ఏ చట్టం అతిక్రమించి ద్రువీకరించినందున 59 కేసులు నమోదు చేశామన్నారు. అధిక ధరకు విక్రయించినందుకు తూనికలు-కొలతల చట్ట నిబంధన ప్రకారం 889 కేసులు నమోదు చేశామన్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నందున ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం 38 కేసులు నమోదు చేశామని వీటిలో ప్రఖ్యాత బ్రాండ్ లకు చెందిన వంట నూనెలను స్థానికంగా తయారు చేసి బ్రాండ్ ప్రింట్ తో అమ్ముతున్న వారిపై 8 క్రిమినల్ కేసులు నమోదు చేశామని అయన తెలిపారు. కృష్ణా జిల్లాలో క్రొత్త స్టాక్ అమ్మకాలు చేస్తూ తక్కువ ధర కలిగిన పాత స్టాక్ అమ్మకుండా నిల్వ ఉంచిన 5.67 మెట్రిక్ టన్నులు ప్రియా గోల్డ్ పామాయిల్ వంట నూనెలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పామ్ ఆయిల్ మరియు ఇతర వంట నూనెలు అక్రమంగా నిల్వ ఉంచడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి వాటి నిరోధానికి హోల్ సేల్ అండ్ రిటైల్ వ్యాపార సంస్థలు, సూపర్ మార్కెట్ లు, తయారీ యూనిట్ల పై విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇడిబుల్ ఆయిల్ నిల్వలపై ఈ నెలలో విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన దాడులు, నమోదు చేసిన 6ఏ కేసులు, స్వాధీనం చేసుకున్న నిల్వలను వివరిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు నమోదు చేసి 93 లక్షల 52 వేల 560 రూపాయల విలువైన 56.624 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం జిల్లాలో 3 కేసులు నమోదు చేసి 2 కోట్ల 67 లక్షల 28 వేల 751 రూపాయల విలువైన 164.434 మెట్రిక్ టన్నులు, తూర్పు గోదావరి జిల్లాలో 10 కేసులు నమోదు చేసి 3 కోట్ల 43 లక్షల 42 వేల 36 రూపాయల విలువైన 181.100 మెట్రిక్ టన్నులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కేసులను నమోదు చేసి 1 కోటీ 43 లక్షల 74 వేల 153 రూపాయల విలువైన 91.327 మెట్రిక్ టన్నులు, కృష్ణా జిల్లాలో రెండు కేసులను నమోదు చేసి 86 లక్షల 88 వేల 463 రూపాయల విలువైన 57.687 మెట్రిక్ టన్నులు, గుంటూరు జిల్లాలో 9 కేసులను నమోదు చేసి 4 కోట్ల 51 లక్షా 92 వేల 75 రూపాయలు, ఒంగోలు జిల్లాలో 15 కేసులను నమోదు చేసి 2 కోట్ల 28 లక్షల 34 వేల 310 రూపాయల విలువైన 151.375 మెట్రిక్ టన్నులు, పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో 4 కేసులు నమోదు చేసి 6 కోట్ల 30 లక్షల 21 వేల 640 రూపాయలు, చిత్తూర్ జిల్లాలో 1 కేసు నమోదు చేసి కోటీ 33 లక్షల 6 వేల 195 రూపాయల విలువైన 75.498 మెట్రిక్ టన్నులు, వై.ఎస్.ఆర్. కడప జిల్లాలో 2 కేసులను నమోదు చేసి 82 లక్షల 7 వేల 500 రూపాయలు విలువైన 53.15 మెట్రిక్ టన్నులు, అనంతపురం జిల్లాలో 2 కేసులు నమోదు చేసి 1 కోటీ 96 లక్షల 98 వేల 237 రూపాయల విలువైన 125.272 మెట్రిక్ టన్నులు, కర్నూల్ జిల్లాలో 4 కేసులను నమోదు చేసి 2 కోట్ల 91 లక్షా 19 వేల 134 రూపాయల విలువైన 153.557 మెట్రిక్ టన్నులు వంట నూనెల నిల్వలను స్వాధీన చేసుకుని సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేశామని విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డా. షoకబ్రత బాగ్చి వివరించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అవకతవకలకు పాల్పడే వ్యాపార సంస్థలకు సంబంధించి సమాచారాన్ని 94409 06259 నెంబరుకు వాట్స్ ఆఫ్ ద్వారా గాని ఎస్.ఎం.ఎస్. ద్వారా గాని అందించాలని అయన కోరారు.
మార్కెట్ లో వంట నూనెల ధరలు పెరగకుండా నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్ లలో తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రముఖ బ్రాండ్ ల తయారీ ఉత్పత్తి దారులతో సమావేశాలు నిర్వహించి లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకుంటున్న ఈ చర్యలు సత్ఫలితాలు ఇచ్చి ధరలు పెరగకుండా నియత్రించగలిగామని అన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *