-ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీల ఆవిష్కరణలో నేతల పిలుపు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టులు అత్యంత విలువైన సమాచారంతో ప్రజలకు చేరువగా ఉండాలని, పాత్రికేయ రంగం ద్వారా సమాజంలో వేళ్లూనుకుని పోయిన కుళ్లును పెకిలించాలని, ప్రజలకు చేరువగా సమాజహితం కోరుకోవాలని, అందుకు ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ రూపొందించిన డైరీ లోని సమాచారం బాగా ఉపయోగపడుతుందని ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడు టి.రవీంద్రబాబు అన్నారు. ఆదివారం స్థానిక బోస్ రోడ్డులోని టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ డైరీలను అధ్యక్షుడు తేళ్ల రవీంద్రబాబు, డివిజన్ కార్యదర్శి కనపర్తి రత్నాకర్ ,కోశాధికారి .జి ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ ఫెడరేషన్ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు విజయవంతంగా నడిపిస్తూ తెనాలి ఫెడరేషన్ శాఖకు పేరు తీసుకు వచ్చిన సహచర పాత్రికేయులు అందరికీ అభినందనలు తెలిపారు. కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ పదవులు అలంకరించడం గొప్పతనం కాదని, వాటిని సమర్ధవంతంగా ముందుకు నడిపించేదానిలోనే సంయమనం, సమయస్ఫూర్తి పాటించి, ముందుకు నడిపించినప్పుడే పదవులకు అర్థం ఏర్పడుతుందన్నారు. ఇందుకు తెనాలి ఎపిడబ్ల్యుజెఎఫ్ సభ్యులందరూ తమ వంతు ఎవరికి వారు కృషి చేసి, ఫెడరేషన్ కు పేరు తీసుకు రావడం పట్ల అభినందిస్తున్నానన్నారు. మున్ముందు ఫెడరేషన్ను మరింత పటిష్టంగా ముందుకు నడిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అంబటి శ్యామ్ సాగర్, పుట్ల పున్నయ్య, గౌరవ సలహాదారు బచ్చు సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్,సభ్యులు మంచికలపూడి రవి, గుమ్మడి ప్రకాష్ రావు, వేమూరు నియోజకవర్గ అధ్యక్షులు మేకల సుబ్బారావు, దాసరివెంకటేశ్వర్లు, కె.సాంబశివరావు, ఎన్.శ్రీకాంత్, భూషణరావు, భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.