విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15, 16 డివిజన్ లకు చెందిన శివకుమారి, ప్రసన్న కుమార్ లకు తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అప్లికేషన్ పెట్టుకోగా వారికి వైద్య చికిత్స నిమిత్తం దాదాపు 50,000 రూపాయలు మంజూరు కాగా సోమవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్,చేతుల మీదుగా కార్యాలయ సిబ్బంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. బెల్లం దుర్గ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని లక్ష్యం తో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సీఎం జగన్మోన్ రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారు అని తెలిపారు. అందరు ఆరోగ్యముగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో ప్రభుత్వ పల సాగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్లా రవి, సొంగా రాజ్ కమల్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …